బడ్జెట్ :గ్రామీణ రంగానికి నిధుల వరద,మహిళ శక్తి కేంద్రాలు,ప్రతి ఒక్కరికీ ఇళ్ళ నిర్మాణం
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ రంగానికి అధిక నిధులను కేటాయించింది.గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నిధులను కేంద్రం కేటాయించింది.
న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం గ్రామీణ రంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో నిధులను కేటాయించింది. 2017..18 ఆర్థిక సంవత్సరంలో 24 శాతం అధికంగా రూ.1,87,200 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద ఖర్చుచేసే నిధులను రూ.38,500 కోట్ల నుండి రూ48 వేల కోట్లకు పెంచారు.ఈ పథకంలో మహిళల భాగస్వామ్యాన్ని 55 శాతానికి పెంచారు.
గ్రామస్థాయిలో గ్రామీణ మహిళల సాధికారతను పెంచేందుకు ఉద్దేశించిన మహిళా శక్తి కేంద్రాలను ఈ ఆర్థిక సంవత్సరం నుండే నెలకొల్పనున్నారు.

వచ్చే ఏడాది మే 1 వ, తేది నాటికి దేశంలోని వందశాతం గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు.ఇప్పటికీ పూరిగుడిసెల్లో నివసిస్తోన్న ఇల్లులేని నిరుపేదలకు 2019 నాటికి కోటి ఇళ్ళను నిర్మించనున్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేసే రుణాలకు కాలపరిమితిని 15 ఏళ్ళ నుండి 20 ఏళ్ళకు పొడిగించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులను రూ.15 వేల కోట్ల నుండి రూ.23 వేల కోట్లకు పెంచారు.ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 2011..2014 మధ్య రోజుకు 73 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాలు జరిగితే 201617 ఆర్థిక సంవత్సరంలో రోజుకు 133 కిలోమీటర్ల నిర్మించేలా వేగాన్ని పెంచారు.
పైపుల ద్వారా నీటిని అందించే పథకంలో బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
-
ఈ నెల 13న పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ : ఒకేసారి రూ 6 వేలు..!! -
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
అమరావతి వేదికగా అరుదైన నిర్మాణం, తెలుగు వైభవాన్ని చాటేలా..!! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!!












Click it and Unblock the Notifications