నెలకు రూ.200 కడితే ప్రతి నెలా రూ.5వేలు.. కేంద్రం అదిరే స్కీమ్
18 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగినవారే ఈ పథకానికి అర్హులు.
కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకంలో చేరితే నెలకు రూ.5వేలు పొందొచ్చు. కనీసం రూ.వెయ్యి పింఛను వస్తుంది. ఎవరైనా ఇందులో చేరాలనుకుంటే వెంటనే చేరిపోవడం ఉత్తమం. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు కలిగినవారు ఈ పథకానికి అర్హులు. 40 సంవత్సరాలు దాటితే అవకాశం లేదు. ఇందులో చేరాలనుకునేవారు నెలనెలా కొంత మొత్తం నగదును చెల్లిస్తూ వెళ్లాలి. వయసు ప్రాతిపదికన చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయిస్తారు.
నెల నెలా మనం చెల్లించే నగదు పింఛను రూపంలోకి మారుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల్లోపు ఏ వయసులోనైనా అటల్ పెన్షన్ యోజనలో చేరితే 60 సంవత్సరాలు దాటిన తర్వాత పింఛను అందిస్తారు. నెలకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు పింఛను పొందొచ్చు. మనం కట్టిన నగదును బట్టి పింఛను నిర్ణయించబడుతుంది. 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మీరు రూ.వెయ్యి పింఛను పొందాలని భావిస్తే నెలకు రూ.42 చెల్లించాల్సి ఉంటుంది.

రూ.3వేలు కావాలంటే రూ.126... ఇలా రూ.5వేల పింఛను కోసం ఇప్పటి నుంచే నెలకు రూ.210 చెల్లించాల్సి వస్తుంది. 18 సంవత్సరాల వయసులోనే ఇందులో చేరినవారికి పై నగదు రూపంలో అందుతుంది. 40 సంవత్సరాల వయసులో ఇందులో చేరితే నెలకు రూ.వెయ్యి పింఛను కోసం రూ.291 చెల్లించాల్సి ఉంటుంది.
రూ.2వేల కోసం రూ.582, రూ.5వేల కోసం రూ.1454 చెల్లించాల్సి వస్తుంది. నామినీకి చివరలో ఒకేసారి రూ.8.5 లక్షలు లభిస్తాయి. రూ.5వేల పింఛను ఆప్షన్ కు ఇది వర్తిస్తుంది. ఇటువంటి ఎన్నో పథకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని, మనకు సమీపంలోని తపాలాశాఖ కార్యాలయానికి వెళితే ఈ పథకాలకు సంబంధించిన అన్ని వివరాలు లభ్యమవుతాయి.












Click it and Unblock the Notifications