వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రూడాయిల్‌పై ఆ ట్యాక్స్‌ను తగ్గించిన కేంద్రం: రిలయన్స్‌ సహా ఆ కంపెనీలకు ఊరట

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: క్రూడాయిల్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించింది. క్రూడాయిల్ టన్ను ఒక్కింటికి ఇదివరకు 23,250 రూపాయల పన్నును వసూలు చేస్తోండగా.. దీన్ని సవరించింది. 17,000 రూపాయలకు తగ్గించింది. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌కూ దీన్ని వర్తింపజేసింది. ఎగుమతి చేసే గ్యాసొలిన్ మీద లీటర్ ఒక్కింటికి విధించిన ఆరు రూపాయల ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్‌ను రద్దు చేసింది.

రిలయన్స్ షేర్లు జూమ్..

రిలయన్స్ షేర్లు జూమ్..

ఆయిల్ సెగ్మెంట్‌లో కొనసాగుతోన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా కంపెనీలకు ఇది ఊరట కలిగించినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టిన ముడిచమురు ధరలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రకటన వెలువడిన తరువాత బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన షేర్ల ధరలు దూసుకెళ్లాయి. 2,500లను దాటేశాయి.

విండ్‌ఫాల్ ట్యాక్స్..

విండ్‌ఫాల్ ట్యాక్స్..

ఈ నెల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను దేశీయ చమురు ఉత్పాదక కంపెనీలపై విధించింది. 27 శాతం మేర భారం మోపింది. దీనికి అదనంగా ప్రత్యేకంగా అదనపు ఎక్సైజ్ డ్యూటీని కూడా వర్తింపజేసింది. దీనితో ఈ పన్ను మొత్తం టన్ను క్రూడాయిల్‌పై 23,250 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధర భారీగా పెరిగినప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, ఆయిల్ ఇండియా కంపెనీలు అదే స్థాయిలో లాభపడ్డాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించింది.

 క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడంతో..

క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడంతో..


ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దీన్ని తగ్గించింది. ప్రస్తుతం బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ క్రూడాయిల్ 106.06 డాలర్లు పలుకుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లోనూ ఈ ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. అక్కడ ఒక బ్యారెల్ క్రూడాయిల్ రేటు 99.34 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదివరకు ఈ ధర 120 నుంచి 125 డాలర్ల వరకు రికార్డయిన విషయం తెలిసిందే.

ఇంధన అమ్మకాలిలా..

ఇంధన అమ్మకాలిలా..

కాగా దేశంలో ఇంధన అమ్మకాల్లో పాత రేట్లే కొనసాగుతున్నాయి. చమురు కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం రెండోసారి వ్యాట్‌ను తగ్గించిన తరువాత ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.

విశాఖలో..

విశాఖలో..


కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది.

రాష్ట్రాల్లో వ్యాట్..

రాష్ట్రాల్లో వ్యాట్..

అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి.

English summary
Central government cut the windfall tax on crude oil after the decline in global prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X