ప్రధాని మోదీ ఎన్నికల బ్రహ్మాస్త్రం - పీవోకే విలీనంపై తీర్మానం..!?
మూడో సారి అధికారం దక్కించుకోవాలనేది ప్రధాని మోదీ లక్ష్యం. హ్యట్రిక్ సాధించేందుకు అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఇండియా కూటమికి ఛాన్స్ లేకుండా దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకొనే ఆకర్ష్ మంత్రాతో మోదీ ముందుకు వెళ్తున్నారు. దశాబ్దాల కాలంగా దేశ ప్రజల్లో చర్చగా ఉన్న పీఓకే పైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
ప్రత్యేక సమావేశాల వేళ:ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ మోదీ బ్రహ్మస్త్రం బయటకు తీస్తున్నారు. జమ్ముకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన కేంద్రం..ఇప్పుడు తిరిగి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్దం అవుతోంది.ఇదే సమయంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై కేంద్రప్రభుత్వం తీర్మానం తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పీఓకేలో నివసిస్తున్న ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుండటంతో ఇదే సరైన సమయంగా భారత్ భావిస్తోంది.

భారత్‌లోని లద్ధాఖ్‌లో విలీనం అవుతామని పీఓకేలోని కొంత ప్రాంతం డిమాండ్ చేస్తుండటం కూడా సానుకూల సంకేతమని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. తీర్మానం వీలుకాకపోతే 1994లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో పార్లమెంటు చేసిన తీర్మానంలో సవరణలు చేసి తిరిగి ప్రతిపాదించే ఛాన్స్ కనిపిస్తోంది.
కేంద్రంలో ముఖ్యలు సంకేతాలు:
తాజాగా కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ పీఓకే తనంతట తాను భారత్‌లో విలీనం అవుతుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జూన్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా కశ్మీర్‌లో సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, పీఓకేను వెనక్కి తీసుకోవడానికి భారతదేశం పెద్దగా కష్టపడక్కర్లేదని అన్నారు.ఈ అంశంపై మూడుసార్లు పార్లమెంట్ తన అభిప్రాయాన్ని ప్రకటించిందని తెలిపారు. దీంతో, కేంద్రం వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కీలక నిర్ణయాలకు ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం అవుతోంది.
అందులో జమిలి, మహిళా బిల్లు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. యూసీసీ బిల్లుపైన స్పష్టత లేదు. ఇదే సమయంలో పీఓకేపై తీర్మానం దిశగా ప్రభుత్వం సంచలన తీర్మానానికి సిద్దం అవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. జీ20 తో ఏర్పడిన సానుకూల వాతావరణం తమకు రాజకీయంగా అనుకూలంగా మలచుకొనేందుకు బీజేపీ వ్యూహాత్మక ఆలోచనలు చేస్తోంది.

ఎన్నికల బ్రహ్మాస్త్రంగా:కొంత కాలంగా భారత్ కు పశ్చిమ దేశాల మద్దతు లభిస్తోంది. అంతర్జాతీయంగా భారత్ బలోపేతం కావటం.. ముఖ్య దేశాల మద్దతు లభిస్తుండటంతో పీఓకేలో చర్యలకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు ఢిల్లీ అధికార..రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.పీఓకేలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయటాన్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. విద్యుత్ ప్రాజెక్టుల నుంచి పాక్ ప్రభుత్వం యూనిట్‌కు రూపాయిన్నర చెల్లించి కొనుగోలు చేసి అదే ప్రాంతానికి రూ.52కు యూనిట్ చొప్పున అమ్మడం, గోధుమ పిండి వంటి నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటడంపై ప్రజలు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు పాక్ ప్రభుత్వ అరాచకాలను వ్యతిరేకిస్తూ భారత్ అధీనంలో ఉన్న లద్దాఖ్‌లో విలీనం అవుతామని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో, అన్ని రకాలుగా పీఓకే విలీనంకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ రకమైన చర్చ నేపథ్యంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ఏం చేయబోతోందనేది ఉత్కంఠ పెంచుతోంది.
-
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications