చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కేంద్రం..!!
న్యూఢిల్లీ: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుంచి పలాస వెళ్తోన్న ప్యాసింజర్.. కొత్త వలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. సిగ్నల్ అందక మెయిన్ లైన్‌పై ఆగివున్న ప్యాసింజర్‌ను.. అదే ట్రాక్‌పై వచ్చిన విశాఖపట్నం-రాయగఢ మధ్య నడిచే పలాస ఎక్స్‌ప్రెస్ వేగంగా ఢీకొట్టింది.
ఈ ఘటనతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. 13 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని విజయనగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

గతంలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోనూ ఇదే తరహా ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. 291 మంది ప్రయాణికులు మరణించిన ఘోర దుర్ఘటన అది. 1,200 మందికి పైగా గాయపడ్డారు. ఈ వరుస ఘోర దుర్ఘటనల తరువాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వరుస ప్రమాదాల తరువాత నివారణ చర్యలను చేపట్టింది.
దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్ స్థాయి అధికారుల ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసింది. మొత్తంగా 10 జనరల్ మేనేజర్ స్థాయి ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్ర కేబినెట్ అపాయింట్స్ కమిటీ అనుమతులను మంజూరు చేసింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంటూ వచ్చిన పోస్టులు అవి.
గుజరాత్ వడోదరలోని నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ డైరెక్టర్ జనరల్‌గా మనోజ్ కృష్ణ అఖౌరీ అపాయింట్ అయ్యారు. హాజీపూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోన్న ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్‌గా అనిల్ కుమార్ ఖండేల్వాల్ నియమితులయ్యారు. జైపూర్ ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న నార్త్ వెస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్‌గా అమితాబ్, కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ జీఎంగా ఎస్ శ్రీనివాస్ అపాయింట్ అయ్యారు.
బెంగళూరు యలహంకలో గల రైల్ వీల్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్‌గా ఆర్ రాజగోపాల్‌ను నియమించింది కేంద్రం. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ జీఎంగా హితేంద్ర మల్హోత్రా, జబల్‌పూర్ ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న వెస్ట్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్‌గా శోభన బందోపాధ్యాయ అపాయింట్ అయ్యారు.
ముంబై కేంద్రంగా కీలకమైన సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్‌గా రామ్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (నిర్మాణ విభాగం) జనరల్ మేనేజర్‌గా ఎస్ కే పాండే, గోరఖ్‌పూర్ నార్త్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్‌గా సౌమ్యా మాథుర్ నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications