తమిళనాడుకు రూ.945 కోట్ల కేంద్రం సాయం: ఏపీకి?
Fengal Cyclone: ఫెంగల్ తుఫాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ ఫండ్ నుంచి రెండు విడతలుగా కేంద్రం వాటాగా 944.80 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై హోమ్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్.. తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిల్లో అల్లకల్లోలం రేపిన విషయం తెలిసిందే. మూడు- నాలుగు రోజులుగా అతి భారీ వర్షాలు దంచికొట్టాయి. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.

తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కాళ్లకురిచి, కడలూర్ జిల్లాలు ఈ భారీ వర్షాల వల్ల అతలాకుతలం అయ్యాయి. తిరువారూర్, తంజావూరు, పుదుక్కోట్టై, అరియలూరు, పెరంబలూరు, నీలగిరి, కోయంబత్తూర్, తిరుచ్చి, తెన్‌కాశి, తిరునెల్వేలి.. జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రామనాథపురం, కారైకల్, పుదుచ్చేరి, తూత్తుకుడి, రామేశ్వరం, మైలాడుథురై జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం తుపాన్ నష్ట పరిహారాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ 944.80 కోట్ల రూపాయల ప్యాకేజీని విడుదల చేయడానికి అంగీకారం తెలిపింది. వరద/తుఫాను ప్రభావిత ప్రాంతాలకు జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను పంపించి తక్షణ సహాయ సహకారాలను అందజేసినట్లు పేర్కొంది.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటికీ అవసరమైన ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, వైమానిక దళాలను పంపించి ఎప్పటికప్పుడు బాధితులను ఆదుకుంటుంటామని పునరుద్ఘాటించింది. తమిళనాడు సహా తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు లాజిస్టిక్ సహాయాన్ని కూడా అందించినట్లు తెలిపింది.

ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఏపీపైనా పడిన విషయం తెలిసిందే. దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటివరకు ఏపీకి ఫెంగల్ తుఫాన్ నష్ట పరిహారాన్ని కేంద్రం ప్రకటించలేదని చెబుతున్నారు.
ఫెంగల్ కాకుండా ఈ సంవత్సరంలో 28 రాష్ట్రాలకు ఇప్పటికే 21,718.716 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో ఎస్డీఆర్ఎఫ్ నుంచి 26 రాష్ట్రాలకు 14,878.40 కోట్లు, ఎన్డీఆర్ఎఫ్ నుంచి 18 రాష్ట్రాలకు రూ. 4,808.32 కోట్లు, రాష్ట్ర విపత్తు నిర్వహణ ఫండ నుంచి 11 రాష్ట్రాలకు 1,385.45 కోట్లు, జాతీయ విపత్తు ఫండ్ నుంచి 646.54 కోట్ల రూపాయలు ఉన్నాయి.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications