యుద్ధం మొదలైన వేళ.. భారత ఆర్మీపై ఆత్మాహూతి దాడి? కేంద్రం ఏం చెప్పింది?

India Pakistan War: జమ్మూ కాశ్మీర్‌‌పై పాకిస్తాన్ భారీ ఎత్తున దాడికి పాల్పడింది. తొలుత డ్రోన్లతో దాడి చేసింది. ఆ తరువాత మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడింది. అనంతరం మిస్సైళ్లనూ సంధించింది పాకిస్తాన్ సైన్యం. మొత్తంగా ఎనిమిది మిస్సైళ్లను ప్రయోగించగా.. వాటన్నింటినీ కూడా భారత ఆర్మీ మధ్యలోనే ఇంటర్‌సెప్ట్ అయింది. వాటిని కూల్చివేసింది.

Centre clarifies that the Suicide Attack at Rajauri in Jammu and Kashmir is completely false

ప్రత్యేకించి- జమ్మూలో పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ భూభాగంపై నుంచి పదుల సంఖ్యలో డ్రోన్లు జమ్మూ వైపు దూసుకుని రావడం కనిపించింది. డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్ ఆర్మీ. ఉధంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్‌కోట్ వైపు దూసుకొచ్చాయి అవి. యుద్ధంలో వినియోగించే స్వార్న్ డ్రోన్లను పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించినట్లు భారత సైనిక వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి.

వరుసబెట్టి వస్తోన్న డ్రోన్లను భారత ఆర్మీ ఎక్కడికక్కడ అడ్డుకుంది. వాటితో ఇంటర్‌సెప్ట్ అయింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూల్చివేస్తోంది. అదే సమయంలో బ్లాక్ అవుట్‌ను కూడా నిర్వహించింది. చీకటి ఆవరించిన జమ్మూ కాశ్మీర్ గగనతలంపై డ్రోన్లు దూసుకుని వచ్చే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ తరువాత కొద్దిసేపటికే నియంత్రణ రేఖ వెంబడి గల సరిహద్దు గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులపై క్షిపణులను ప్రయోగించింది. సత్వారి, సాంబ, ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లల్లో మిస్సైళ్లను సంధించింది. మొత్తంగా ఎనిమిది మిస్సైళ్లను పాక్ ఆర్మీ ప్రయోగించినట్లు వీటిని భారత ఆర్మీ వర్గాలు ధృవీకరించాయి. వాటిని మధ్యలోనే నేల కూల్చివేసినట్లు తెలిపాయి.

అదే సమయంలో- భారత ఆర్మీపై ఉగ్రవాదుల ఆత్మాహూతి దళాలు దాడులు చేశాయని, పెద్ద ఎత్తున నష్టం సంభవించిందంటూ వార్తలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు పోస్ట్ అయ్యాయి. జమ్మూ కాశ్మీర్ రాజౌరీ సెక్టార్‌లో ఈ దాడి జరిగిందని, ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ ధ్వంసమైందనే ప్రచారం సాగింది.

దీని తీవ్రతను గమనించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వార్తలను తోసిపుచ్చింది. ఫిదాయీ (ఆత్మాహూతి దళాలు) దాడి జరగలేదని కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలను విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది.

రాజౌరీలో భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని పాకిస్తాన్ నాశనం చేసిందని సోషల్ మీడియా పోస్ట్‌లు నిరాధారమని పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ సమాచారం సర్కులేట్ అవుతోందని వివరించింది. దీన్ని షేర్ చేయవద్దని, ఖచ్చితమైన సమాచారం కోసం కేంద్రం ప్రభుత్వం/అధికార వర్గాలపై మాత్రమే ఆధారపడాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+