Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో ఛాన్స్: ఆధార్- పాన్ లింక్ గడువు పొడగింపు.. జూన్ 30 వరకు అవకాశం

పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయమని కేంద్రం పదే పదే చెబుతోంది. డెడ్ లైన్ కూడా విధించింది. వాస్తవానికి మార్చి 31వ తేదీకి గడువు ఇచ్చింది. కానీ ఇంతవరకు కొందరు లింక్ చేయలేదు. దీంతో వారి కోసం మరో అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నందున.. వెసులుబాటు కల్పించామని ఆదాయపు పన్ను శాఖ తెలియజేసింది.

ఆధార్ పాన్ కార్డు లింక్ చేసుకోనట్లయితే రూ.వెయ్యి వరకు ఫైన్ విధిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. అదీ ప్రస్తుతానికి వర్తించదని తెలిపింది. సెక్షన్ 148 ఆదాయపు పన్ను 1961 ప్రకారం చర్యలు తీసుకున్నామని ఐటీ శాఖ తెలిపింది.

Centre extends last date for Aadhaar-PAN linking to June 30

గడువు తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ 2021 లో నిబంధనను విధించింది కేంద్ర ప్రభుత్వం. కానీ మరోసారి అవకాశం ఇచ్చింది. పాన్ కార్డుకు - ఆధార్ లింక్ చేసినట్లయితే ఈ-ఫైలింగ్ పోర్టల్ లింకు క్లిక్ చేసి ఆధార్, పాన్ నెంబర్ సమర్పించి స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+