ఫాస్టాగ్ యూజర్లకు ముఖ్య గమనిక: నేటి నుంచి.. !!

టోల్ ప్లాజాల సమీపంలో నివసించే ప్రైవేట్ వాహనదారులకు కోసం ఫాస్టాగ్ వార్షిక పాస్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. స్థానికంగా రోజూ ప్రయాణించే వారిపై పడే టోల్ భారాన్ని తగ్గించే ఉద్దేశంతో కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. టోల్ ప్లాజా సమీపంలో నివసించే స్థానిక ప్రైవేట్ వాహన యజమానులు తక్కువ ధరకు ఏడాది పొడవునా వర్తించే వార్షిక పాస్‌ను పొందే వీలు కల్పించింది. ఇది.. నేటి నుంచి అమలులోకి వచ్చింది.

ఈ నూతన నిబంధనల ప్రకారం టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక ప్రైవేట్ వాహన యజమానులు రూ. 1,500 గానీ, రూ. 3,000 చెల్లించి వార్షిక పాస్ పొందవచ్చు. సదరు టోల్ ప్లాజా గనుక స్థానిక మున్సిపాలిటీ సరిహద్దులకు వెలుపల ఉంటే ఏడాదికి రూ. 1,500 ఫీజు వర్తిస్తుంది. ఒకవేళ టోల్ ప్లాజా మున్సిపల్ సరిహద్దు పరిధిలోనే ఉన్నట్లయితే వార్షిక పాస్ ఫీజు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాస్ పొందినవారు ఏడాది పొడవునా టోల్ ఫీ కట్టకుండా రాకపోకలు సాగించవచ్చు.

Centre introduced Local Pass private vehicle owners residing within 20 km of toll plaza from today

వీటి రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న సమీక్షిస్తుంది. ఫాస్టాగ్ నూతన వార్షిక పాస్ సొంత అవసరాలకు వాడే కార్లు, జీపులు, వ్యాన్ల వంటి ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ అవసరాల కోసం రిజిస్టర్ అయిన వాహనాలకు ఈ వెసులుబాటు లభించదు. ఈ పాస్ తీసుకోవాలనుకునే వాహనదారుడి నివాసం ఖచ్చితంగా ఆ టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి. దరఖాస్తు చేసుకునే నాటికి వాహనంపై యాక్టివ్ ఫాస్టాగ్ ఖచ్చితంగా అమర్చి ఉండాలి.

బంగారం ధరల్లో భారీ ఉపశమనం
బంగారం ధరల్లో భారీ ఉపశమనం

నివాస ఆధార పత్రాలతో పాటు వాహన వివరాలను సమర్పించి ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీన్ని పొందిన వాహనదారులు ఒక సంవత్సర కాలంలో గరిష్టంగా 200 సార్లు సంబంధిత టోల్ ప్లాజా గుండా ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. ఒకే టోల్ ప్లాజా నుండి వెళ్లి, తిరిగి రావడాన్ని రెండుసార్లు ప్రయాణించినట్లుగా లెక్కిస్తారు. ఈ పాస్ జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై చెల్లుబాటు కాదు. తమ నివాసానికి సమీపంలో ఉండే నిర్దుష్ట స్థానిక టోల్ ప్లాజా వద్ద మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది.

దీపావళి నాడు తిరుమల శ్రీవారి సన్నిధిలో..: ఆర్జిత సేవలు రద్దు
దీపావళి నాడు తిరుమల శ్రీవారి సన్నిధిలో..: ఆర్జిత సేవలు రద్దు

జాతీయ రహదారులపై క్లోజ్డ్ టోల్ యూజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమల్లో ఉన్న ప్రదేశాలలో కూడా స్థానిక వార్షిక పాస్‌లను వినియోగించడానికి వీలు ఉండదు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత హైవే టోల్ ప్లాజా గుండా కాకుండా వేరే సర్వీస్ రోడ్డు గానీ, ప్రత్యామ్నాయ రహదారి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ పాస్ వర్తించదు. సాధారణ వాహనాల తరహాలోనే నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+