Bangladesh: బంగ్లా అల్లర్ల వెనుక విదేశీ కుట్ర ? ఆర్మీ అలర్ట్-అఖిలపక్ష భేటీలో కేంద్రం..!

పొరుగుదేశం బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న భారీ అల్లర్లు, ప్రధాని హసీనా రాజీనామా, భారత్ కు శరణార్ధిగా రావడంపై ఇవాళ కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై కేంద్రం ఈ భేటీ ఏర్పాటు చేసింది. దీనికి విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలు పార్టీల నేతలు హాజరయ్యారు. కేంద్ర హోం, విదేశాంగ, రక్షమ మంత్రులు అమిత్ షా, జై శంకర్, రాజ్ నాథ్ సింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు.

అఖిలపక్ష భేటీలో విదేశాంగమంత్రి జై శంకర్ బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాల క్రమాన్ని విపక్షాలకు వివరించారు. అలాగే ఈ అల్లర్ల వెనుక ఉన్న కారణాలపైనా చర్చించారు. ఇందులో విదేశీ శక్తుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేశారు.బంగ్లాదేశ్ అల్లర్లకు మద్దతునిచ్చేలా పాకిస్తాన్ మంత్రి ఒకరు తన సోషల్ మీడియా ప్రొఫైల్ ఫొటో పెట్టడాన్ని ప్రస్తావించారు.

centre suspects foreign conspiracy behind Bangladesh riots in all party meet says army on alert

అయితే ఆధారాలు లేనందున విదేశీ శక్తుల కుట్రను నిర్ధారించలేమన్నారు. ఈ మేరకు విపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు జై శంకర్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి వేచిచూసే ధోరణిని భారత్ అనుసరిస్తుందని ఆయన తెలిపారు. ఎలాంటి పరిణామాల్ని అయినా ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు.

మరోవైపు ఇవాళ్టి అఖిలపక్ష భేటీలో పాల్గొన్న రాజకీయ పార్టీల్నీ కేంద్రానికి ఈ విషయంలో అండగా నిలవాలని నిర్ణయించాయి. కేంద్రం నిర్ణయాల్ని ఏకగ్రీవంగా సమర్ధించాయి. ఇదే విషయాన్ని విదేశాంగమంత్రి జైశంకర్ భేటీ అనంతరం ట్వీట్ చేశారు. ఏకగ్రీవంగా తమకు మద్దతిచ్చిన విపక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం భారత్ లో శరణార్ధిగా ఉన్న షేక్ హసీనా విషయంలో ఏం చేయాలన్న దానిపై వేచిచూసే ధోరణి అనుసరించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+