• search

చంద్రబాబుకు చిక్కులు: కేసీఆర్‍కు కేంద్రం ఫేవర్లు.. కాళేశ్వరంపై ఇలా..

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ/ హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుకు, ఆయన సారథ్యంలోని ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గుతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మధ్య దూరం పెరుగుతుందా? అన్న అనుమానం తలెత్తుతున్నది.

  2014 అసెంబ్లీ, లోక్ సభ జమిలీ ఎన్నికల్లో తెలంగాణ ఏర్పాటుపై ఇష్టారాజ్యంగా విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు, నరేంద్ర మోదీ తర్వాత కూడా అదే స్టయిల్‌లో వ్యవహరిస్తూ వచ్చారు. కానీ పరిస్థితులు మారుతున్నా కొద్దీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బీజేపీ.. తెలంగాణ ప్రభుత్వం నాయకత్వం వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ మధ్య స్నేహం చిగురిస్తుందా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

   కేంద్రం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా ఆశ్చర్యం

  కేంద్రం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా ఆశ్చర్యం

  దానికి కారణం ఆగమేఘాలపై గోదావరి నదిపై ‘కాళేశ్వరం' ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ, జల సంఘం తదితర అనుమతులన్నీ శరవేగంతో మంజూరు చేయడమే నేపథ్యం. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులన్నీ కేంద్రం ఇచ్చేసింది. తెలంగాణకు ప్రతిష్ఠాత్మక సాగునీటి ప్రాజెక్టు ‘కాళేశ్వరం'కు మెడ నరాలు తెగే స్పీడ్‌తో అన్ని రకాల అనుమతులు ఇచ్చేసి సీఎం కే చంద్రశేఖర్ రావునే ఆశ్చర్య చకితులను చేసేసింది.

   అనుమతుల కోసం ఢిల్లీలోనే నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ బస

  అనుమతుల కోసం ఢిల్లీలోనే నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ బస

  అయితే తెలంగాణ భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెంటవెంటనే ‘హస్తిన'కు వెళ్లి కేంద్ర మంత్రులతో పదేపదే సమావేశం అవుతూ, అధికారులను కలుస్తూ అనుమతులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ను ‘హస్తిన'లోనే ఉంచి కేంద్రం అధికారులకు వచ్చిన సందేహాలను తీర్చడంలో ప్రధాన భూమిక వహించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అందునా సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు రావడం సర్వ సాధారణమే.

   కేంద్రం నుంచి వడివడిగా తెలంగాణకు నిధులు

  కేంద్రం నుంచి వడివడిగా తెలంగాణకు నిధులు

  ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాలకు కేంద్రం అనుమతులు కానీ అంత తేలికేం కాదు. కానీ తెలంగాణకు ఎంతో కీలకమైన ‘కాళేశ్వరం' పథకం అనుమతులు జారీ చేయడంలో కేంద్రం అసాధారణ ఆసక్తి కనబరచడమే ఆసక్తికరంగా కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర వాటా ప్రకారం వచ్చే నిధుల మంజూరులోనూ అనూహ్యమైన శ్రద్ధ కేంద్ర ప్రభుత్వంలో కనిపిస్తున్నదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేయాల్సిన నిధులకు సంబంధించిన ఫైళ్లన్నీ కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు వడివడిగా క్లియర్ చేసి నిధులు విడుదల చేసేస్తున్నారు.

   కాళేశ్వరంపై తెలంగాణ బీజేపీ విమర్శలు ఇలా

  కాళేశ్వరంపై తెలంగాణ బీజేపీ విమర్శలు ఇలా

  కానీ టీఆర్ఎస్, కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామి కాదు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.

   నిధుల విడుదలపై బాబు సర్కార్‌కు అష్టకష్టాలు

  నిధుల విడుదలపై బాబు సర్కార్‌కు అష్టకష్టాలు

  మరోవైపు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మిత్రపక్షం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల పైనా, ప్రాజెక్టుల అమలుపైనా చంద్రబాబు ప్రభుత్వం అష్టకష్టాల పాలవుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు చాలాచాలా ముఖ్యమైతే.. ఆంధ్రప్రదేశ్ ఎంతోకాలంగా ఆంధ్రులంతా ఆశగా వేచి చూస్తున్న ‘పోలవరం' ప్రాజెక్టు ఆ రాష్ట్రానికి అంతే ముఖ్యం.

   పోలవరంపై కేంద్రం అనవసర కొర్రీలు

  పోలవరంపై కేంద్రం అనవసర కొర్రీలు

  గమ్మత్తేమిటంటే రెండు ప్రాజెక్టులు ‘గోదావరి' నదిపైనే నిర్మిస్తున్నవి కావడం గమనార్హం. కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తీరుపై కేంద్రం పలు రకాల అభ్యంతరాలు, కొర్రీలు లేవనెత్తుతున్నది. తద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమస్యలు కల్పిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

   ఐదేళ్ల ప్రత్యేక హోదాపై ఇలా చంద్రబాబు తిలోదకాలు

  ఐదేళ్ల ప్రత్యేక హోదాపై ఇలా చంద్రబాబు తిలోదకాలు

  దీనికి తోడు భాగ్యనగర స్థాయిలో ‘అమరావతి' నగర నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కేంద్రం నుంచి ఏపీ సీఎంకు శుష్క వాగ్దానాలే మిగులుతున్నాయా? అన్న సందేహాలు వస్తున్నాయి. ఏపీకి అన్ని విధాల చేయూతనిస్తామని 2014 ఎన్నికల్లో పదేపదే ప్రకటించిన కమలనాథులు తర్వాత తమ సొంత భవితవ్యంపై కేంద్రీకరించారా? అనిపిస్తున్నది. 2014 ఫిబ్రవరిలో తెలంగాణ ఏర్పాటు సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐదేళ్ల ‘ప్రత్యేక హోదా'కు కారణాలేమైనా చంద్రబాబు తిలోదకాలివ్వాల్సి వచ్చింది.

   ఏడాది దాటినా ప్రత్యేక ప్యాకేజీ ఊసే ఎత్తని కేంద్రం

  ఏడాది దాటినా ప్రత్యేక ప్యాకేజీ ఊసే ఎత్తని కేంద్రం

  దాని స్థానంలో కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ సీఎం చంద్రబాబు బలవంతంగా ఒప్పుకోవాల్సిన దైన్య స్థితి ఏర్పడింది. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించి ఏడాది దాటినా అతీగతీ లేదు. దీన్ని బట్టి తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి దగ్గరవుతూ.. ఏపీలో టీడీపీకి దూరమవుతున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంతో టీడీపీ తెగదెంపులు చేసుకునే అవకాశాలు లేకపోయినా.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే భవిష్యత్ అవసరాలు తీర్చుకోవచ్చునన్న దూరపు ఆలోచన కమలనాథుల్లో ఉన్నదా? అన్న సంకేతాలు ఉన్నాయి.

  English summary
  The breakneck speed with which the Centre has given all clearances to Kaleshwaram project, the flagship irrigation project of Telangana chief minister K Chandrasekhar Rao, has come as a surprise to many.In the normal course, securing clearances from the Centre is not so easy but in the case of the Telangana project, the Bharatiya Janata Party-led NDA government at the Centre showed unusual interest in giving clearances.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more