స్టార్ హీరోల పులి గోళ్ల లాకెట్ల మ్యాటర్ తేల్చేసిన అధికారులు, మ్యాటర్ వీక్ గా ఉందా ?
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పులి గోళ్ల రచ్చ పెద్ద ఎత్తున దూమరం రేపుతోంది. దీంతో అటవి శాఖ అధికారులు సెలబ్రిటీల ఇళ్లలో సోదాలు నిర్వహించగా అందులో స్యాండిల్ వుడ్ ఛాలెంజింగ్ స్టార్ నటుడు దర్శన్ ఇంట్లో కూడా అటవీశాఖ అధికారులు తనిఖీలు చేశారు. హీరో దర్శన్ విషయంలో అటవి శాఖ అధికారులు ఇచ్చిన క్లారిటీకి సంబంధించిన సమాచారం ఇలా ఉంది.
బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ వర్తూరు సంతోష్ పులి గోళ్ల లాకెట్ ధరించినందుకు అతన్ని అరెస్టు చేశారు, ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల బంధువులు సహా పలువురు పులి గోళ్ల లాకెట్ ల కారణ: నానా ఇబ్బందులు పడ్డారు. ఈ కేసును విచారించిన అనంతరం అటవీశాఖ అదనపు చీఫ్ కన్జర్వేటర్ కుమార్ పుష్కర్ వివరణ ఇచ్చారు.

అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కుమార్ పుష్కర్ మీడియాతో మాట్లాడుతూ నిన్న బెంగళూరులోని 5 చోట్ల సోదాలు చేశామని వివరించారు. ఫిర్యాదు అందుకున్న తరువాత పలువురు ఇళ్లలో దాడి చేసి గోరు స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిస్తాం. అక్కడి నుంచి నివేదిక అందిన తర్వాత పులి గోళ్లు అని వెలుగు చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
పులి గోళ్లను ధరించిన కేసుకు సంబంధించి శాండల్‌వుడ్ నటులు దర్శన్, మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామి, బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ, కన్నడ స్టార్ హీరో జగ్గేష్, ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఇంటికి వెళ్లామని ఆయన వివరించారు. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ దగ్గర ఉన్న పులి గోళ్ల లాకెట్ స్వాధీనం చేసుకున్నామని, ఆ లాకెట్ లోని పులి గోరు అసలుది కాదని అనిపించిందని అన్నారు.
మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి దగ్గర ఉన్న పులి గోరు కూడా నకిలిదే అని అటవి శాఖ అధికారులు అంటున్నారు. నటుడు జగ్గేష్ కు సంబంధించి ఆయన పాత వీడియో స్టేట్‌మెంట్‌పై చర్య తీసుకోలేమని, ఆయన దగ్గర ఉన్న పులి గోళ్ల లాకెట్ చాలా పాతదని, అయితే పులిగోళ్లు తారుమారు చేశారని తెలిస్తే ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అటవి శాఖ అధికారులు అంటున్నారు.

జగ్గేష్ సాక్షాలు తారుమారు చేశాడని వెలుగు చూస్తే ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అటవి శాఖ అధికారులు అంటున్నారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ వర్తూరు సంతోష్ విషయానికి వస్తే అతని దగ్గర ఉన్నది కొత్త పులి గోళ్లు కావడంతో వెంటనే దానిని మేము గుర్తించామని కర్ణాటక అటవి శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications