నీళ్లు లేక అల్లాడుతుంటే మీ మొండిపట్టు ఏమిటి ?, స్టార్ హీరో ట్విట్, అగ్నికి ఆజ్యం పోసినట్లు !

బెంగళూరు/చెన్నై: కావేరి జలాల కోసం కర్ణాటక- తమిళనాడు ప్రభుత్వాల మధ్య రోజురోజుకు గొడవలు ముదిరిపోతున్నాయి. కావేరీ నీరు చాలా తక్కువగా ఉందని, మాకు తాగడానికి నీరు లేదని, మేము తమిళనాడుకు నీరు వదల్లేమని కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటకకు చెందిన నాయకులు గత కొంతకాలంగా వాదిస్తున్నారు.

బెంగళూరు ప్రజలు నిత్యం కావేరి నీటిని తాగుతున్నారని, ఇదే బెంగళూరులో లక్షలాది మంది తమిళ ప్రజలు జీవనం సాగిస్తున్నారని. వర్షాలు పడకపోయినా కావేరీ నీటిని వదలాలని తమిళనాడు ప్రభుత్వ మొండిగా వ్యవహరిస్తోందని కర్ణాటక ప్రభుత్వం మండిపడుతోంది. ఇప్పటికే కావేరి జలాల పంపిణి విషయంపై తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు కావేరి జలాల పంపిణి విషయం సినీరంగు పులుముకుంది.

Challenging star Darshan responded that injustice is being done to Karnataka in the matter of Cauvery water.

కావేరీ వివాదం మరింత ముదిరే అవకాశం కనపడుతోంది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ మరో 15 రోజుల పాటు తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కావేరీ కంట్రోల్ అథారిటీ ఆదేశించడం కర్ణాటక ప్రజల ఆగ్రహానికి కారణమైంది. తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు వ్యతిరేకంగా కన్నడ అనుకూల సంస్థలు, ఆమ్ ఆద్మీ పార్టీ, రైతు సంఘాలు సహా పలు సంస్థలు, కన్నడ సంఘాలు పోరాడుతున్నాయి.

కావేరి వివాదంపై స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటులునోరు మెదపకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బెంగళూరు వాసులకు కావేరీ నీరే ఆధారమని, వారు కూడా పోరాటంలో పాల్గొనాలని పలు సంస్థలు పిలుపునిచ్చాయి. కన్నడ అనుకూల కార్యకర్తలు మరియు ప్రజలు సోషల్ మీడియాలోనూ సీనియర్ నటులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరి సమస్యపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.

ఇప్పుడు స్యాండిల్ వుడ్ ఛాలెంజింగ్ స్టార్, ప్రముఖ నటుడు దర్శన్ కావేరి వివాదంపై ట్వీట్ చేశారు. కర్ణాటక వాటా నుంచి కావేరీ నీటికి కోత పెట్టడం ద్వారా ఎక్కువ నీరు రాబట్టేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ఈ సమయంలో సాగునీటికి చాలా నష్టం వాటిల్లుతోంది కాబట్టి అన్ని గణాంకాలను పరిశీలించి వీలైనంత త్వరగా కన్నడిగులకు న్యాయం చేద్దాం అంటూ హీరో దర్శన్ ట్వీట్ చేశారు.

Challenging star Darshan responded that injustice is being done to Karnataka in the matter of Cauvery water.

కావేరీ నదీ జలాల పంపిణీ వివాదంపై చర్చించేందుకు సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన ఢిల్లీలో ఇవాళ అన్ని పార్టీల కేంద్ర మంత్రులు, ఎంపీలతో సమావేశం జరుగుతోంది. సమావేశంలో కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్, కేంద్రమంత్రులు ప్రహ్లాద జోషి, శోభా కరంద్లాజే, భగవంత్ ఖూబా, నారాయణస్వామి, సుప్రీంకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 26 వరకు 15 రోజుల పాటు రోజూ 5 వేల క్యూసెక్కుల కావేరి నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు మన దగ్గర నీరు లేనప్పుడు ఎలా విడుదల చేస్తామని కర్ణాటక ప్రశ్నిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+