అమ్మాయిని ‘హే సెక్సీ’ అన్నాడు: నిందితుడికి 2ఏళ్ల జైలు

Subscribe to Oneindia Telugu

చండీగఢ్: ఓ యువతిని తన మాటలతో వేధింపులకు గురిచేసిన ఓ యువకుడు కటాకటాలపాలైన ఘటన చండీగఢ్‌లో చోటు చేసుకుంది. డారియాకు చెందిన పంకజ్ సింగ్ పంకజ్ సింగ్(23) అనే యువకుడు ఓ పదిహేడేళ్ళ అమ్మాయిని 'హే సెక్సీ' అని పిలుస్తూ వేధింపులకు గురిచేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017 సెప్టెంబరు 4న బాధితురాలు కళాశాల నుంచి ఇంటికి వెళ్తూండగా సెక్టార్ 11లో పంకజ్ సింగ్ చూశాడు. వెంటనే ఆమెను వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు.

Chandigarh man gets 2-year jail for calling minor girl ‘sexy’

'హే సెక్సీ' అంటూ వేధించసాగాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన పంకజ్ ఆమెను చెంప దెబ్బ కొట్టాడు. బాధితురాలు తన సోదరుడిని పిలిచింది. అతనిని కూడా పంకజ్ కొట్టాడు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులు పంకజ్‌పై కేసు నమోదు చేశారు.

నిందితుడు పంకజ్‌ను కోర్టు ఎదుట హాజరు పర్చగా.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి పూనమ్ ఆర్ జోషీ ఈమేరకు తీర్పు చెప్పారు. పంకజ్‌కు రెండేళ్ళ జైలు శిక్షతోపాటు రూ.21,000 జరిమానా కూడా విధించారు. అయితే పంకజ్‌కు బెయిలు మంజూరైంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A local court on Saturday sentenced a Daria man to two years jail for calling a 17-year-old girl “hey sexy”.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి