ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ- రిటర్నింగ్ అధికారి శిక్షార్హుడు: నిప్పులు చెరిగిన సుప్రీంకోర్టు
Chandigarh Mayor election: అత్యంత వివాదాస్పదమైన చండీగఢ్ మేయర్ ఎన్నిక వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. ఘాటు విమర్శలు చేసింది. అదే తీవ్రతతో కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త మేయర్ సారథ్యంలో ఎలాంటి సమావేశాలను కూడా నిర్వహించకూడదంటూ తక్షణ ఆదేశాలను జారీ చేసింది.
ఇటీవలే చండీగఢ్ మేయర్ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ సీనియర్ నేత మనోజ్ సోంకర్ చండీగఢ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ- కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి కుల్‌దీప్ సింగ్‌ను మట్టికరిపించారు.

చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న మొత్తం సంఖ్యాబలం 35. కౌన్సిలర్లుగా ఎన్నికైన వారిలో బీజేపీ-14, ఆమ్ ఆద్మీ పార్టీ-13, కాంగ్రెస్-7, శిరోమణి అకాలీదళ్‌కు ఒక సభ్యుడు ఉన్నారు. మేయర్ ఎన్నికలో బీజేపీ తరఫున మనోజ్ సోంకర్, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అభ్యర్థిగా కుల్‌దీప్ సింగ్ పోటీ చేశారు.
నిజానికి ఈ ఎన్నికలో సంఖ్యాపరంగా చూసుకుంటే ఆప్- కాంగ్రెస్ ఉమ్మడి కూటమి అభ్యర్థి విజయం సాధించాల్సి ఉంది. అలా జరగలేదు. పోలింగ్ సమయంలో బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు పడ్డాయి. కుల్‌దీప్ సింగ్‌కు 12 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెెస్-ఆప్‌కు చెందిన ఎనిమిది ఓట్లను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీ.. చెల్లనివిగా ప్రకటించారు. దీనితో 16 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలిచారు.
ఈ ఎన్నిక వ్యవహారంపై ఆప్- కాంగ్రెస్ కూటమి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మేయర్ ఎన్నికలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. తమకు ఉన్న సంఖ్యాబలం గురించి వివరించింది. ప్రత్యేకించి- తమ కూటమికి చెందిన కౌన్సిలర్లు వేసిన ఎనిమిది ఓట్లను చెల్లనివిగా ప్రకటించడం సరికాదని, దీనిపై విచారణ జరిపించాలని కోరింది.
ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కొద్దిసేపటి కిందటే ఘాటు వ్యాఖ్యలు చేసింది. రిటర్నింగ్ అధికారి.. బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారని, వాటిని ట్యాంపర్ చేశారనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను రిటర్నింగ్ అధికారి అపహాస్యం చేశారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
రిటర్నింగ్ అధికారి తీరు ఇదేనా, ఎన్నికలను నిర్వహించేది ఇలాగేనా అంటూ రిటర్నింగ్ అధికారిని నిలదీసింది. అతను అన్ని రకాలుగా శిక్షార్హుడని తేల్చి చెప్పింది. బ్యాలెట్ పేపర్లు, వీడియోలతో సహా ఈ ఎన్నిక సంబంధించిన అన్ని రికార్డులనూ భద్రపర్చాలని, వాటన్నింటినీ పంజాబ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అందజేయాలని ఆదేశించింది.
తదుపరి ఆదేశాలను వెలువడించేంత వరకూ కొత్త మేయర్ మనోజ్ సోంకర్ సారథ్యంలో ఎలాంటి సమావేశాలు గానీ, భేటీలను గానీ నిర్వహించకూడదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఆయన ఎలాంటి అధికారిక భేటీలను నిర్వహించకూడదని తెలిపింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications