వచ్చే ఏడాదే: సాంకేతిక కారణాలతో చంద్రయాన్-2 మిషన్ వాయిదా
భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ముందు అనుకున్న ప్రకారం 2018 అక్టోబర్‌లో చంద్రయాన్-2ను చంద్రుడిపైకి పంపాల్సి ఉండగా ఈ మిషన్‌ను వాయిదా వేశారు శాస్త్రవేత్తలు. కొన్ని సాంకేతిక కారణాలతోనే మిషన్ వాయిదా వేసినట్లు ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ అన్నాదురై తెలిపారు. దీంతో భారత్ కంటే ముందు ఇజ్రాయిల్ దేశం స్పేస్ సెల్ అనే ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి తయారైన రాకెట్‌ను చంద్రుడిపైకి ఈ ఏడాది డిసెంబర్‌లో పంపనుంది.

ఇందుకోసం ఇజ్రాయిల్ కంపెనీ అమెరికాకు చెందిన ఫాల్కన్-9 రాకెట్‌ను వినియోగిస్తోంది. డిసెంబర్‌లో దీని యాత్ర ప్రారంభమై ఫిబ్రవరి 13,2019న చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. అయితే ఇప్పుడు భారత్ ఇజ్రాయిల్ దేశాల మధ్య ఎవరు ముందు చంద్రుడిపైకి రాకెట్ పంపుతారో అన్న పోటీ నెలకొంది. చంద్రుడిపై దక్షిణ ధృవం వద్ద రాకెట్‌ను ల్యాండ్ చేసి ఆ తర్వాత రోవర్‌తో పలు ప్రయోగాలు నిర్వహించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే... వచ్చే ఏడాది జనవరిలో చంద్రయాన్ -2 మిషన్ నింగిలోకి దూసుకెళ్లి చంద్రుడిపై ఫిబ్రవరిలో ల్యాండ్ అవుతుందని అన్నాదురై వివరించారు. జీశాట్ జీఎస్ఎల్వీ-ఎమ్‌కే 3 రాకెట్ ద్వారా ప్రయోగం నిర్వహిస్తామని అన్నాదురై తెలిపారు. ఈ రాకెట్ బరువు దాదాపు 640 టన్నులు ఉంటుందని చెప్పారు. చంద్రుడిపై ఉన్న వాతావరణానికి అనుకూలంగా ఉండేలా రోవర్‌ను పరీక్షిస్తున్నామని ఆయన వివరించారు. 2008లో భారత్ చంద్రయాన్ -1ను తొలిసారిగా ప్రయోగించిందని అయితే చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ జరిగింది. దీంతో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ముక్కలుగా విరిగిపోయి ఉంటుందని శాస్త్రవేత్తలు నాడు తెలిపారు. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడిపై తమ రాకెట్లను సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాయి.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications