చంద్రుడిపై విక్రమ్ దిగిన శివ శక్తి పాయింట్ వద్ద అద్భుతం ఆవిష్కృతం..!!
బెంగళూరు: 2023 ఆగస్టు 23వ తేదీ. దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే రోజు అది. ఆ రోజే చందమామ మన చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర.. విజయ తీరాలకు చేరింది. దిగ్విజయమైంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. మాడ్యుల్ చందమామ దక్షిణధృవంపై అడుగు మోపింది ఆ రోజే.
రోవర్‌లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (లిబ్స్), ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌ను పేలోడ్స్‌గా పంపించారు శాస్త్రవేత్తలు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ ఇయానోస్ఫియర్, లేజర్ రెట్రోరెఫ్లెక్టర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్..వంటి పేలోడ్స్ కీలక డేటాను సేకరించిన విషయం తెలిసిందే.

ఈ ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన కీలక సమాచారన్ని సేకరించింది ఇస్రో. చందమామ దక్షిణ ధృవంపై రసాయన, ఖనిజ నిల్వలు భారీగా ఉన్నట్లు గుర్తించింది. ప్రత్యేకించి- సల్ఫర్ నిల్వలు భారీగా ఉన్నట్లు నిర్ధారించింది. మనిషి జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ సైతం ఉందనే విషయాన్ని ఇస్రో నిర్ధారించింది ఈ ప్రయోగం ద్వారానే.
ఆక్సిజన్, సల్ఫర్, అల్యూమినియం, క్యాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని లిబ్స్ పేలోడ్ గుర్తించినట్లు ఇస్రో తెలిపింది. అత్యధిక శక్తి గల లేజర్ కిరణాలను లిబ్స్ ప్రసారం చేయగలదు. చంద్ర శిలలు, లేదా మట్టి లక్షణాలను తెలుసుకోవడానికి లిబ్స్‌ను వినియోగించింది ఇస్రో.
చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శివ శక్తి పాయింట్‌గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే పాయింట్ వద్ద ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ అద్భుతాన్ని చంద్రయాన్ 2కు చెందిన ఆర్బిటర్ క్యాప్చర్ చేసింది. దీన్ని చంద్రయాన్ 2 ఆర్బిటర్ హైరిజల్యూషన్ కెమెరా బంధించింది.
అది- ఎజెక్టా హ్యాలో. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ అయినప్పుడు గాల్లోకి ఎగిరిన ధూళి ఓ వలయంగా ఆవిష్కృతమైంది. సుమారు 108.4 మీటర్ల చదరపు విస్తీర్ణం వరకు విస్తరించాయి చంద్రుడి ధూళి కణాలు. శివ శక్తి పాయింట్ మొత్తాన్నీ కవర్ చేసింది. దాని చుట్టూ ఓ వలయంగా ఏర్పడింది.
సాంకేతికంగా దీన్ని ఎజెక్టా హ్యాలోగా పిలుస్తామని ఇస్రో తెలిపింది. విక్రమ్ ల్యాండర్.. దక్షిణ ధృవంపై దిగినప్పుడు సుమారు 2.06 టన్నుల చంద్ర ధూళి గాల్లోకి ఎగజిమ్మిందని పేర్కొంది. దీన్ని మూన్ ఎపిరెగోలిత్గా అభివర్ణించింది. గతంలో అపోలో 15 ల్యాండ్ అయినప్పుడు ఇలాంటి వలయం ఏర్పడినట్లు వివరించింది. దీన్ని చంద్రయాన్ 1 ఆర్బిటర్ గుర్తించినట్లు తెలిపింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications