Chandrayaan-3: చంద్రుడికి 177 కిలో మీటర్ల దూరంలో చంద్రయాన్-3..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రస్తుతం చంద్రుడికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రయాన్ -3 అంతరిక్ష నౌకను 150 కి.మీ. x 177 కి.మీ. కక్ష్యలో ఉంచారు. బుధవారం ఈ దూరాన్ని 100 కిలోమీటర్ల కు తగ్గించనున్నారు. ఆ తర్వాత ల్యాండర్ విడిపోయి చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేయనుంది.

చంద్రుడిపై సాఫ్ట్ గా దిగేందుకు ల్యాండర్ వేగాన్ని తగ్గించుకుంటూ ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్​ అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టారు. చంద్రయాన్-3 ఆగస్టు 5న చంద్రడి కాక్ష్యలో ప్రవేశపెట్టారు. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, రోవర్ నుంచి రోల్ అవుట్ ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.47 గంటలకు జరగనుంది. విజయవంతమైతే, యుఎస్‌ఎస్‌ఆర్, యుఎస్, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన ప్రపంచంలో నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.

Chandrayaan-3 orbits at a distance of 177 km from the moon
భారత్ కు పోటీగా ఆగస్టు 11న చంద్రుడిపైకి లునా-25 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలో వోస్తోక్నీ కాస్మో డ్రోమ్ నుంచి ఈ ప్రయోగం చేసినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ పేర్కొంది. ఈ ప్రయోగాన్ని గత శుక్రవారం తెల్లవారుజామున 2:10 గంటలకు చేశారు. లూనా-25 ల్యాండర్ 1,752 కిలోల బరువుతో పోలిస్తే, నాలుగు కాళ్ల రష్యన్ ల్యాండర్ 800 కిలోల బరువు ఉంటుందని తెలిపారు.

లూనా-25 వల్ల చంద్రయాన్-3కి ఎలాంటి ఇబ్బంది ఉండదని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ తెలిపింది. 1.8 టన్నుల బరువుతో, 31 కిలోల శాస్త్రీయ పరికరాలను మోసుకెళ్లే లూనా-25 మానవ జీవితానికి తోడ్పడే ఘనీభవించిన నీటి ఉనికిని పరీక్షించడానికి 15 సెం.మీ (6 అంగుళాలు) లోతు నుండి రాతి నమూనాలను తీయడానికి ఒక స్కూప్‌ను ఉపయోగించనున్నారు. వాస్తవానికి లూనా-25ను అక్టోబర్ 2021కి ప్రయోగించాల్సి ఉండే.. కానీ దాదాపు రెండేళ్లపాటు వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+