చుక్కల్లో చుక్కలా- జాబిల్లికి మరింత చేరువగా..

తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం.. ప్రయోగించిన చంద్రయాన్ 3- చందమామ వైపు దూసుకెళ్తోంది. చంద్రుడి ఉపరితలంపై సంచరించడానికి వీలుగా అమర్చిన ల్యాడర్, రోవర్‌ను మోసుకెళ్తోన్న శాటిలైట్.. జాబిల్లికి మరింత చేరువైంది. తన అంతరిక్ష ప్రయాణంలో భాగంగా- ఈ ఉపగ్రహం మూడో ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశించింది.

ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది. కొద్దిసేపటి కిందటే దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ నెల 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపు దూసుకెళ్లింది చంద్రయాన్ 3.

chandrayan31

ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చందమామపై అడుగు పెడుతుంది. దీనికోసం చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఎంచుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3 ఉపగ్రహం 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం భూకక్ష్యలో ప్రరిభ్రమిస్తోన్న ఈ శాటిలైట్.. పెరీజిని అధిగమించినట్లు ఇస్రో తెలిపింది.


దీని తరువాత క్రమంగా చందమామ ఆర్బిట్‌లోకి ప్రవేశిస్తుంది. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5:47 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 ల్యాండర్.. దిగుతుంది. ఆ వెంటనే రోవర్- జాబిల్లి ఉపరితలంపై కాలు మోపుతుంది. చందమామ ఉపరితలంపై శాశ్వత ముద్ర వేయబోతోంది ఈ శాటిలైట్.

చంద్రయాన్ 3 శాటిలైట్‌ మోసుకెళ్లిన ప్రజ్ఞాన్ రోవర్‌ వీల్‌పై మూడు సింహాలు, ఇస్రో లోగోను ముద్రించడమే దీనికి కారణం. జాబిల్లిపై దిగిన తరువాత అది సంచరిస్తున్నప్పుడు మూడు సింహాలు, ఇస్రో లోగో జాడలు అక్కడి మట్టిపై పడతాయి. అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆ ఉద్దేశంతోనే రోవర్‌లోని చివరి రెండు వీల్స్‌‌లల్లో ఒకదానిపై మూడు సింహాలు, మరో దానిపై ఇస్రో లోగోను ముద్రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+