జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం, కర్ణాటక సీఎం, డీసీఎంకు థ్యాక్స్, మోదీ !
బెంగళూరు/న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన ముగించుకుని నేరుగా బెంగళూరు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ చంద్రయాన్- 3 విజయానికి కారణమైన ఇస్రో బృందంలోని శాస్త్రవేత్తలను కలిసేందుకు బెంగళూరుకు వచ్చారు. హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్టు నుంచి ఇస్రో సెంటర్‌కు బయలుదేరుతున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
అదే సమయంలో ప్రజలు జై మోదీ జైజై మోదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోదీ వారిని అడ్డుకుని జై జవాన్, జై కిసాన్, 'జై విజ్ఞాన్ అని నినాదాలు చేశారు. ప్రధాని మోదీ గట్టిగా జై జవాన్, జై కిసాన్, 'జై విజ్ఞాన్ అని నినాదాలు చెయ్యడంతో మోదీని అనుసరించిన ప్రజలు కూడా అదే మాటలు గట్టిగా పలకడంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

ఇస్రో శాస్త్రవేత్తల గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, శాస్త్రవేత్తల విజయాలకు భారతదేశం మొత్తం గర్వపడుతోందని, మన శాస్త్రవేత్తల శక్తి ప్రపంచం మొత్తానికి తెలుసు అని, ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం వైపు చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు నేరుగా బెంగళూరు వచ్చి ఇస్రోను సందర్శించాలని నిర్ణయించుకున్నానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
విదేశాల్లో ఉన్నప్పుడు ఇస్రోను సందర్శించాలని నేను మొదట నిర్ణయించుకున్నానని, శాస్త్రవేత్తలను కలిసేందుకు విదేశాల నుంచి నేరుగా బెంగళూరు వచ్చానని, తనకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చంద్రయాన్- 3 విజయవంతం కాండంతో ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకుని తిరుగుతున్నాడని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
విదేశీ పర్యటన ముగించుకుని తాను మొదట బెంగళూరువాసుల ముఖాన్ని చూశాను. విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి నేరుగా తాను బెంగళూరు రావాలని నిర్ణయించుకున్నానని, తాను బెంగళూరు రావడానికి త్వరగా అన్ని ఏర్పాట్లు చేసినందుకు కర్ణాటక గవర్నర్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి హెచ్ఏఎల్ విమానాశ్రయానికి బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బీజేపీ నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా హెచ్ఏఎల్ విమానాశ్రయం, ఇస్రో కార్యాలయం ముందుకు చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications