చందమామపై సూర్యోదయం..ఏం జరగబోతోంది?

బెంగళూరు: ఇంకో రెండు రోజులు. చందమామపై భానోదయం కాబోతోంది. చంద్రుడిపై లేలేత సూర్యకిరణాలు ప్రసరించబోతోన్నాయి. 14 రోజుల పాటు అక్కడ అలముకుని ఉన్న గాఢాంధకారం తొలగిపోనుంది. కాంతి రేఖలు వెలుగు నింపనున్నాయి. కాలగమనంలో జాబిల్లిపై ఇది సహజమే అయినప్పటికీ- ఈ సారి మాత్రం కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈ సమయం కోసం ఎదురు చూస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా? అనే ఉత్కంఠతతో గడుపుతోంది. దీనికి కారణం.. మిషన్ చంద్రయాన్ 3. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపై వాలిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది.

Chandrayaan 3: Vikram lander and Pragyan rover may back to life on September 22

చంద్రుడిపై ఇస్రో చేపట్టిన పరిశోధనల తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభమైన తరువాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. నిద్రలోకి జారుకున్నాయి. అక్కడ ఒక్క రాత్రి గడిచిపోవడం అంటే.. భూమి మీద 14 రాత్రులతో సమానం. ఈ నెల 22వ తేదీన రాత్రి సమయం ముగియనుంది. పగలు ఆరంభం కానుంది. ఇంకో 14 రోజుల పాటు పగటి సమయం ఉంటుందక్కడ.

భానుడి కిరణాలకు విక్రమ్ ల్యాండర్, రోవర్‌లో అమర్చిన బ్యాటరీలు రీఛార్జ్ కావాల్సి ఉంటుంది. ఈ రెండు బ్యాటరీలు కూడా సౌర విద్యుత్ ఆధారంగా పని చేసేవే కావడం దీనికి కారణం. రాత్రి సమయం కావడం వల్ల ప్రస్తుతం బ్యాటరీలు డెడ్ అయ్యాయి. అవి రీఛార్జ్ కావాలీ అంటే సౌర విద్యుత్ అవసరం.

ఎల్లుండి నుంచి పగటి సమయం మొదలు కాబోతోన్నందున సూర్యుడి వెలుగును గ్రహించడం వల్ల బ్యాటరీలు మళ్లీ రీఛార్జ్ అవుతాయని ఇస్రో ఆశిస్తోంది. అవి రీఛార్జ్ అయితేనే రోవర్ మళ్లీ యాక్టివేట్ కాగలుగుతుంది. అదే జరిగితే- ఇంకో 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగించడానికి వీలు ఉంటుంది.

విక్రమ్ ల్యాండర్‌లో పేలోడ్స్‌గా పంపించిన చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఛాస్టే), రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్- లాంగ్ముయిర్ ప్రోబ్ (రంభా ఎల్పీ),ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ).. వంటి ఇన్-సిటు పేలోడ్స్ అన్నీ ప్రస్తుతం టర్న్ ఆఫ్ మోడ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రోవర్‌కు అమర్చిన రిసీవర్ మాత్రమే స్విచాన్‌లో ఉంది. అది చీకటి రాత్రుల్లో కూడా కూడా పని చేయగలుగుతుంది.

చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరిగి రావడానికి 28 రోజుల సమయం పడుతుందనే విషయం తెలిసిందే. ఇందులో 14 రోజులు సూర్యుడి వెలుగులో.. మరో 14 రోజులు చీకట్లో ఉంటుంది చందమామ. చీకటి రోజులు ఆరంభమైనప్పుడు చంద్రుడి ఉపరితలంపై తీవ్రమైన చలి ఆరంభమౌతుంది. దక్షిణ ధృవంపై నమోదయ్యే ఉష్ణోగ్రత మైనస్‌లో పడిపోతుంది. మైనస్ 180 నుంచి మైనస్ 230 డిగ్రీలు.

గడ్డ కట్టించే ఇంత తీవ్రమైన చలిని తట్టుకుని నిలిచే శక్తి ప్రజ్ఞాన్ రోవర్‌కు లేదు. అక్కడ మళ్లీ పగటి సమయం ఆరంభమైన తరువాత రోవర్ మనుగడ కొనసాగించగలుగుతుందా? లేదా? అనేది సవాల్‌గా మారింది. ఫలితంగా- ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+