Chandrayaan 3: టెన్షన్ పెడుతోంది?: కోడిమఠం స్వామిజీ ఏం చెప్పారంటే..?
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. కీలక దశకు చేరుకుంది. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే ల్యాండర్ విడిపోయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోన్నాయి.
కిందటి నెల 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్ 3 చందమామ వైపు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. చంద్రాయన్ 2 క్రాష్ ల్యాండింగ్‌కు గురైన విషయం తెలిసిందే. చంద్రుడిపై ల్యాండింగ్ చేసే సమయంలో దాని వేగాన్ని నియంత్రించడంలో ఇస్రో విఫలమైంది. ఫలితంగా అంచనాలకు అందని వేగంతో నేరుగా చందమామ ఉపరితలాన్ని ఢీకొట్టింది. ముక్కలైపోయింది.

నిజానికి- ప్రయోగ సమయంలో ప్రకటించిన ల్యాండింగ్ టైమింగ్‌లో చివరి నిమిషంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 23వ తేదీన సరిగ్గా సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రయాన్ 3.. జాబిల్లి మీద కాలు మోపుతుందని ఇదివరకు ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఇందులో మార్పులు చేసింది ఇస్రో. ల్యాండింగ్ సమయాన్ని కొంత ముందుకు జరిపింది. సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు బదులుగా 6 గంటల 04 నిమిషాలుగా ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6:04 నిమిషాలకు చంద్రయాన్ 3.. చంద్రుడిపై అడుగు మోపుతుందని తాజాగా వెల్లడించింది. ల్యాండింగ్ కోసం ఇస్రో.. చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఎంచుకుంది.
చంద్రుడిపై ప్రయోగాలు సాగించడానికి రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలమైన నేపథ్యంలో ఇక అందరి దృష్టీ చంద్రయాన్ 3 మిషన్ మీదే నిలిచింది. చంద్రయాన్ 2 విఫలమైన అనుభవం ఉండటం.. కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. 2019లో చంద్రయాన్ 2 చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్‌కు గురి కావడం.. తాజాగా లూనా- 25 పరిస్థితి కూడా అదే తరహాలో ఉండటం వల్ల తెలియకుండానే కలవరం కలిగిస్తోంది.

ఈ పరిణామాల మధ్య- కర్ణాటకలోని బెళగావికి చెందిన ప్రఖ్యాత కోడిమఠం పీఠాధిపతి శ్రీ శివానంద స్వామిజీ.. చంద్రయాన్ 3పై జోస్యం చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా విజయవంతమౌతుందని అన్నారు. చంద్రయాన్ 3ని ప్రయోగించడానికి, చంద్రుడిపై ల్యాండ్ చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఎంచుకున్న సమయాన్ని బట్టి లెక్కిస్తే- ఈ ప్రయోగం సఫలమౌతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications