వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్-2 థీమ్ : అదిరిపోయిన లాల్‌బాగ్చా గణేశ్ ప్రతిమ ...

|
Google Oneindia TeluguNews

ముంబై : మిగిలింది మరికొన్ని గంటలే.. సోమవారం ఉదయమే గణేశ్ మహారాజ్ భక్తుల చేత పూజలు అందుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే గల్లీలో గణనాథుడి కోసం మండపాలు ఏర్పాటుచేశారు. ఒకరికి మించి మరొకరు డేకరేట్ చేస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మండపాలు వినూత్నంగా రూపొందిస్తుంటారు. ఇక లాల్ బాగ్చాలో ఏర్పాటుచేసే వినాయకుడి ప్రతిమకు విశిష్టత ఉంటుంది. అదే చంద్రయాన్-2 థీమ్‌తో ముందుకొస్తుంది. ఆ వినాయకుడి ప్రతిమ చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

వినూత్నం ..

వినూత్నం ..

1934 నుంచి లాల్‌బాగ్చాలో గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి కూడా 20 అడుగుల వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ సారి చంద్రయాన్-2 థీమ్‌తో వినాయకుడిని తీర్చిదిద్దారు. విఘ్నేశుడి ప్రతిమ చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. చంద్రయాన్ -2 థీమ్‌తో ఏర్పాటు చేయడంపై అమితానందానికి గురవుతున్నారు. ఈ సారి కమిటీ సభ్యులు ఎంచుకున్న థీమ్ బాగుందని ప్రశంసిస్తున్నారు. లాల్ బాగ్చా కమిటీ సభ్యులు తమ కొత్తదనాన్ని మరోసారి చాటిచెప్పారని గుర్తుచేస్తున్నారు.

చంద్రయాన్ థీమ్

చంద్రయాన్ థీమ్

చంద్రయాన్-2 థీమ్‌తో గణేశ్ మహరాజ్ కొలువుదీరబోతున్నాడు. ఇటు వేదికపై వినాయకుడి ప్రతిమకు ఇరువైపులా ఆర్టిఫిషియల్ అంతరిక్ష యాత్రికులు కూడా ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్‌లో శాటిలైట్ లాంచింగ్ వీడియో క్లిప్ కూడా కనిపిస్తోంది. గ్రహాలు, సౌరమండలం కూడా కనువిందు చేస్తున్నాయి. మొత్తం లాల్ బాగ్చా వినాయక మండలి చంద్రయాన్ థీమ్ బాగుంది. ఈ వినాయకుడి ప్రతిమను ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు. అంతరిక్ష యాత్రికుల ఫోటోలు బాగున్నాయని చెప్తున్నారు. దీనికి తోడు గ్రహాలు, సౌరమండలం మరింత శోభ తీసుకొచ్చాయని తెలిపారు.

 స్పెషల్

స్పెషల్

ముంబైలో ఏర్పాటుచేసే వినాయకుడి విగ్రహాలో లాల్ బాగ్చా ఒక ప్రత్యేకత ఉంది. ఏటా విభిన్న ఆకృతిలో వినాయకుడి విగ్రహాలను రూపొందిస్తారు. ఈ సారి చంద్రయాన్ థీమ్‌తో ముందుకొచ్చింది. 20 అడుగులతో ఏర్పాటుచేసిన వినాయకుడి ప్రతిమ కళ్లు తిప్పుకొనివ్వడం లేదు. గణేశుడిని నవరాత్రులు పూజలు చేస్తారు. ఉదయం, సాయంత్రం భక్తుల చేత పూజలు అందుకొంటారు. తర్వాత అరేబియా సముద్రంలో నిమజ్జనం చేస్తామని కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

English summary
Ganesh Maharaj is going with the Chandrayaan-2 theme. There are also artificial astronauts on either side of the statue of Lord Ganesha. There is also a satellite launch video clip in the background. Planets and the Solar System are also disappearing. The Lal Bagcha Vinayaka Mandir Chandrayan theme is great. The statue of Lord Ganesha is appreciated by every one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X