వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుడికి చుక్కలు చూపిన కేజ్రీ, ఆటో డ్రైవర్‌కు ఫైన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: సామాన్యుడిగా చెప్పుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముంబైలో సామాన్యులకు చుక్కలు చూపించారు. మహారాష్ట్రలో తన పర్యటనను ప్రారంభించిన కేజ్రివాల్ బుధవారం లోకల్ రైలులో ప్రయాణించడంతో తన పర్యటనను మొదలుపెట్టారు. అయితే ఈ ప్రయాణం అత్యంత గందరగోళం మధ్య కొనసాగింది. ఆయన పర్యటన నేపథ్యంలో రైలులో ముంబై ప్రజలు ఇబ్బంది పడ్డారు.

నగర శివార్లలోని అంధేరినుంచి చర్చి గేట్ వరకు నిదానంగా నడిచే రైల్లోకి కేజ్రివాల్, తన అనుచరులతో కలిసి ఎక్కడంతో ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న మీడియా ప్రతినిధులు కొంతమంది కూడా కేజ్రీవాల్ ఉన్న బోగీలోకి అతికష్టం మీద ప్రవేశించారు. ఎఎపి కార్యకర్తలు ఆయన చుట్టూ రక్షణగా నిలబడి, మీడియాతో ఆయన మాట్లాడకుండా చూశారు.

Chaos for aam aadmi as Arvind Kejriwal takes local train in Mumbai

అంధేరి నుంచి కేజ్రీవాల్ బృందం ఎక్కిన రైలు రద్దీగా ఉండే చర్చి గేట్ స్టేషన్‌కు చేరుకునే సమయానికి ఆయనను చూడడానికి అభిమానులు, మామూలు ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడ్డంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పార్టీ కార్యకర్తలు తోసుకురావడంతో చర్చి గేట్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లు సైతం పడిపోయాయి.

అతికష్టం మీద కేజ్రీవాల్ స్టేషన్ బైటికి వచ్చి నారిమన్ పాయింట్ వద్ద పార్టీ నిధుల సేకరణకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. కేజ్రివాల్ స్టేషన్ నుంచి వెళ్లే సమయంలో కొంతమంది యువకులు ఆయనకు నల్లజెండాలు చూపించారు. మరోవైపు, ముగ్గురికన్నా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకుని నిబంధనలు ఉల్లంఘించారంటూ కేజ్రీవాల్‌ను తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు పోలీసులు జరిమానా విధించారు. అలాగే, కేజ్రీవాల్ కాన్వాయ్‌లోని ఇతర ఆటోవాలాలకు కూడా పోలీసులు ఇలానే జరిమానా విధించినట్లు తెలుస్తోంది.

కొత్త ఒరవడి సృష్టిస్తా

రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. కాంగ్రెస్ బిజెపిలనే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు మత రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ముంబైలో అవినీతిని ఊడ్చి పారేస్తానని హామీ ఇచ్చారు. మోడీ

English summary
Arvind Kejriwal's tour of Mumbai on public transport today left his main audience, the common man, reeling from the chaos on a weekday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X