వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ 16వ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణం, రాహుల్ గాంధీ హాజరు

|
Google Oneindia TeluguNews

ఛండీగఢ్: పంజాబ్ 16వ ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ చన్నీతో ప్రమాణం చేయించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు సుఖిందర్ ఎస్ రంధ్వానా, ఓపీ సోని ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పంజాబ్ వ్యవహారాల బాధ్యునిగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్, రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు చరణ్‌జిత్ సింగ్ చన్నీ గురుద్వారాను దర్శించుకున్నారు. ఆ తర్వాత సీనియర్ నేత హరీశ్ రావత్ తో కలిసి రాజ్‌భవన్ చేరుకున్నారు.

charanjit singh channi takes oath as 16th chief minister of Punjab

కొత్త ముఖ్యమంత్రికి రాహుల్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీనే కావడం గమనార్హం. చన్నీ పంజాబ్ మాల్వా బెల్డ్‌లో రూప్‌నగర్‌ జిల్లాలోని చామ్‌కౌర్‌ సాహిబ్‌ అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చరణ్​జీత్ అంతకుముందు అమరీందర్‌ సింగ్‌ కెబినేట్‌లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.

కాగా, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేసిన 24 గంటల్లోనే కాంగ్రెస్‌ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రిని ఖరారు చేసింది. ముందు సుఖ్జీందర్‌ సింగ్‌ అని వార్తలు వచ్చినా.. కాసేపటికే చరణ్‌జీత్‌ సింగ్‌ పేరును అధిష్టానం ప్రకటించింది. పలు పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. పంజాబ్ సీఎంగా ఈసారి ఎస్సీ నేతకు అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

మరోవైపు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చన్నీ సోమవారం మధ్యాహ్నం మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను కలవనున్నట్లు తెలిసింది. చన్నీని కెప్టెన్ అమరీందర్ సింగ్ భోజనానికి ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త సీఎంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మాజీ సీఎం ఇంటికి వెళ్లనున్నట్లు సమాచారం.

Recommended Video

Telangana Liberation Day సెప్టెంబర్ 17 విమోచనమా, విలీనమా, విద్రోహమా ? | Explained || Oneindia Telugu

పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. పంజాబ్ రాష్ట్ర ప్రజల పురోగతి కోసం నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

English summary
Channi takes oath as 16th chief minister of Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X