చార్ ధామ్ యాత్రీకులకు బిగ్ అలర్ట్- బ్రేక్..!!

Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేవభూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్‌లో వెలిసిన చార్ ధామ్ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి దేశం నలుమూలల నుంచీ లక్షలాదిగా తరలి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.

ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. భక్తుల కోసం ఆయా ఆలయాలన్నీ తెరచుకున్నాయి. ఈ ఏడాది మే 10వ తేదీన గంగోత్రి, యమునోత్రి, 12వ తేదీన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను భక్తుల సందర్శనార్థం తెరిచారు.

Chardham Yatra put on hold due to the heavy rain alert in Uttarakhand

మళ్లీ శీతాకాలం ఆరంభ సమయంలో అంటే నవంబర్ 12వ తేదీన గంగోత్రి, యమునోత్రి, 14వ తేదీన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలు మూతపడతాయి. విపరీతమైన మంచు పడటం, ప్రతికూల వాతావరణం వల్ల సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఆయా ఆలయాల్లో భక్తులకు అనుమతి ఉంటుంది.

ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. వర్షాల తీవ్రత మరో మూడు రోజుల పాటు ఉంటుందంటూ డెహ్రాడూన్‌లోని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఘర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వర్షాల తీవ్రతపై ఆయన ఈ ఉదయం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

చార్‌ ధామ్ యాత్రకు వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ యాత్రలో ఉన్నావాళ్లు రిషికేష్ వద్దే ఆగిపోవాలని కోరారు. భక్తులకు ఎలాంటి ప్రమాదం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వివరించారు. సురక్షితంగా ఉండాలని సూచించారు.

కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల బద్రీనాథ్‌కు వెళ్లే జాతీయ రహదారి మూసుకుపోయింది. ఈ మార్గంలో రాకపోకలు సాగట్లేదు. అనేక చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. గుంతలు ఏర్పడ్డాయి. ప్రయాణం సాగించడానికి అనుకూలంగా ఉండట్లేదు.

జోషిమఠ్ సమీపంలోని విష్ణు ప్రయాగ వద్ద అలకనందా నది ఉగ్రరూపాన్ని ధరించింది. ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాద సూచికను మించి అలకనందా నది పరుగులు పెడుతోంది. తీర ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విష్ణు ప్రయాగ వద్ద దహూలి గంగతో సంగిస్తుందీ నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+