మైనింగ్ దందా: నలుగురి నరబలి?

మధురై: మైనింగ్ కేసు దర్యాప్తు చేస్తుంటే మరో సంచలనాత్మక కేసు వివరాలు బయటకు వచ్చిన సంఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని మధురై జిల్లా మలమ్ పట్టి ప్రాంతంలో నలుగురిని నరబలి ఇచ్చారని వెలుగు చూసింది.

మైనింగ్ కుంబకోణం కేసులో పోలీసు అధికారులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే విచారణలో కుంబకోణం కేసులోని ప్రధాన నిందితుడు, పీఆర్ పీ మైనింగ్ కంపెనీ యజమాని పీ.ఆర్. పళనిస్వామి కారు డ్రైవర్ షాక్ కు గురి చేసే విషయాలు బయటపెట్టాడు.

1999వ సంవత్సరంలో తాము పుదుక్కోటి అనే ప్రాంతం నుంచి నలుగురిని తీసుకు వచ్చి మైనింగ్ కంపెనీ దగ్గర నరబలి ఇచ్చామని పోలీసులకు చెప్పాడు. నరబలి ఇచ్చిన వారిలో ఇద్దరు మానసిక వికలాంగులు ఉన్నారని, వారి గొంతులు కోసి బలి ఇచ్చామని అన్నాడు.

Charges of Human Sacrifice for Granite Baron in Madurai in Tamil Nadu

వారిని పూడ్చి పెట్టడానికి తాను సహకరించానని ఆ కారు డ్రైవర్ పోలీసుల ముందు అంగీకరించాడు. పోలీసులు నరబలి ఇచ్చిన చోట తవ్వకాలు చేపట్టారు. ఇద్దరి హస్తిపంజరాలు బయటకు తీసి పోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని పోలీసు అధికారులు అన్నారు.

మైనింగ్ కంపెనీ కింగ్ పీ.ఆర్. పళనిస్వామి మీద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పళని స్వామి అంటున్నారు. ఇతను దాదాపు రూ. 16,000 వేల కోట్లు పన్నురూపంలో ప్రభుత్వానికి చెల్లించకుండ ఎగవేశాడని అధికారులు అంటున్నారు. ఈ కేసు విచారణలోనే నరబలి విషయం వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+