టెన్త్, ఇంటర్ టాపర్లకు హెలికాఫ్టర్ లో చక్కర్లు-మాట నిలబెట్టుకున్న సీఎం...
ఛత్తీస్ ఘడ్ లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. రాజకీయ నేతలు ప్రజలకు, ఓటర్లకు హామీలు ఇవ్వడం, గద్దెనెక్కాక వాటిని మర్చిపోవడం చూస్తూనే ఉంటాం. అలాగే అధికారంలో ఉండగా ఇచ్చిన హామీలకు కూడా దిక్కుండదు. కానీ ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ సీఎం భూపేష్ భగేల్ మాత్రం విద్యార్ధులకు ఇచ్చిన ఓ హామీ నిలబెట్టుకుని ప్రశంసలు అందుకుంటున్నారు.
ఛత్తీస్ ఘడ్ లో పదో తరగతి, 12వ తరగతిలో టాపర్లుగా నిలిచిన విద్యార్ధులకు హెలికాఫ్టర్ లో ఉచితంగా చక్కర్లు కొట్టిస్తానంటూ ఇచ్చిన హామీని సీఎం భూపేష్ భగేల్ ఇవాళ నిలబెట్టుకున్నారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా పదోతరగతి, పన్నెండో తరగతిలో టాపర్లుగా నిలిచిన వారిని హెలికాఫ్టర్లలో చక్కర్లు కొట్టించడం మొదలుపెట్టిన్నట్లు సీఎం భగేల్ ఇవాళ ట్విట్టర్ లో గర్వంగా షేర్ చేసుకున్నారు. దీంతో ఈ వార్త, హెలికాఫ్టర్ లో విహరిస్తున్న విద్యార్ధుల ఫోటోలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

ఇవాళ తొలి బ్యాచ్ లో భాగంగా 125 మంది టాపర్లను హెలికాఫ్టర్ రైడ్ కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మిగతావిద్యార్ధుల్ని కూడా దశల వారీగా హెలికాఫ్టర్లలో విహరింపజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇలా విద్యార్ధుల్ని హెలికాఫ్టర్ రైడ్ లు చేయించడం ద్వారా వారిలో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ హామీతో విద్యార్ధుల్లో పోటీ తత్వం కూడా పెరుగుతుందని వారు చెప్తున్నారు. ఏదేమైనా టాపర్లు మాత్రం హెలికాఫ్టర్ రైడ్స్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
𝗛𝗲𝗹𝗶𝗰𝗼𝗽𝘁𝗲𝗿 𝗥𝗶𝗱𝗲🚁
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 8, 2022
देखिए, बच्चे कितने खुश हैं!
हमने वादा किया था कि 10वीं और 12वीं के टॉपर बच्चों को हम हेलीकॉप्टर राइड कराएँगे।
आज इसकी शुरुआत हो गयी है।
कक्षा 10वीं और 12वीं के 125 छात्र-छात्राएं लेंगे हेलीकॉप्टर जॉयराइड का आनंद। pic.twitter.com/5c4dbOvTbx












Click it and Unblock the Notifications