ఛత్తీస్‌గఢ్ కేబినెట్ విస్తరణ.. ఒక మహిళా సహా 9మందికి ఛాన్స్
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ మంత్రివర్గం విస్తరణ మంగళవారం జరిగింది. ఇప్పటికే కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు భూపేశ్ భగల్. తాజాగా మంగళవారం నాడు 9మంది ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కొత్త మంత్రులచే ప్రమాణం చేయించారు. తొమ్మిదిమందిలో ఒక మహిళా ఎమ్మెల్యేకు మంత్రిగా అవకాశం కల్పించారు. ప్రమాణ స్వీకారం చేసినవారిలో.. కవాసీ లక్మా, అనిలా బేడియా, జైసింగ్ అగర్వాల్, రుద్ర గురు, రవీంద్ర చౌబే, మహ్మద్ అక్బర్, ఉమేశ్ పటేల్, శివ కుమార్ దహారియా, ప్రేం సాయి సింగ్ తెక్కం ఉన్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. 90 సెగ్మెంట్లకు గాను 68 స్థానాలను కైవసం చేసుకుంది కాంగ్రెస్. 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీకి 15 స్థానాల్లో మాత్రమే విజయం లభించింది.

దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈనెల 17న సీఎంగా భూపేశ్ భగల్ తో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సింగ్ దేవ్, తమ్రద్వాజ్ సాహు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం నాడు మరో తొమ్మిది మంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో మంత్రివర్గం సంఖ్య 12కి చేరింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications