బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cheating: ఐటీ హబ్ లో నకిలి కాల్ సెంటర్లు, ఉద్యోగులతో ?, అమెరికా ప్రజల టార్గెట్, కిలాడీలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని ప్రముఖ టెక్ పార్క్ లో ఓ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వందలాది మంది ఉద్యోగులు ఈ కాల్ సెంటర్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. కాల్ సెంటర్ లో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు ఎప్పటిలాగే ఉద్యోగాలకు వెళ్లారు. అయితే ఆఫీసుకు వెళ్లిన కాల్ సెంటర్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అది నకిలి కాల్ సెంటర్ అని తెలుసుకున్న ఉద్యోగులు బిత్తరపోయారు.

Actor: పార్క్ లో ప్యాంట్ విప్పేసి ఫేమస్ నటుడు ఏం చేశాడంటే ?, సీసీటీవీల్లో, ఫోక్సో కేసు, ఎందచాట, ఏంది !Actor: పార్క్ లో ప్యాంట్ విప్పేసి ఫేమస్ నటుడు ఏం చేశాడంటే ?, సీసీటీవీల్లో, ఫోక్సో కేసు, ఎందచాట, ఏంది !

ఇంతకాలం మీరు నకిలి కాల్ సెంటర్ లో ఉద్యోగాలు చేశారని పోలీసులు చెప్పడంతో ఉద్యోగులు బిత్తరపోయారు. ఉద్యోగులు తేరుకునే లోపు నకిలి కాల్ సెంటర్ నిర్వహకులకు సహకారం అందిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. నకిలి కాల్ సెంటర్ లు ఏర్పాటు చేసిన గుజరాత్ కు చెందిన కిలాడీలు చేసిన పనికి ఇప్పుడు ఉద్యోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Cheating: Fake call centre busted in Bengaluru city in Karnataka, 11 held for duping US citizens.

బెంగళూరు నగరంలోని వైట్ ఫీల్డ్ లోని గాయిత్రీ టెక్ పార్క్ లో ఎథికల్ ఇన్ఫో ప్రై.లి. కంపెనీ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అమెరికాలోని అమాయక ప్రజలను టార్గెట్ చేసుకున్న కాల్ సెంటర్ నిర్వహకులు వారికి ఫోన్లు చెయ్యడం, మీ అకౌంట్ లో డబ్బులు బదిలి అయ్యిందా అని మాయమాటలు మాట్టాడి లైన్ లో పెడుతున్నారని పోలీసులు అన్నారు.

Challenge:గవర్నర్ నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఠాక్రే వర్గం,జెట్ స్పీడ్ తో ఏక్ నాథ్ కు గ్రీన్ సిగ్నల్Challenge:గవర్నర్ నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఠాక్రే వర్గం,జెట్ స్పీడ్ తో ఏక్ నాథ్ కు గ్రీన్ సిగ్నల్

అమెరికా ప్రజలను మాత్రమే టార్గెట్ చేసుకున్న కాల్ సెంటర్ నిర్వహకులు తరువాత వారి అకౌంట్ నుంచి భారీ మొత్తంలో నగదు బదిలి చేసుకుంటున్నారని పోలీసులు అంటున్నారు. రెండు సంవత్సరాల నుంచి అమెరికా ప్రజలను మోసం చేస్తున్న కాల్ సెంటర్ నిర్వహకులు రిషి వ్యాస్ ప్రతిక్, హరీష్, హేత్ పటేల్, కిరణ్, సయ్యద్ తో పాటు 11 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు ఎక్కువ మంది గుజరాత్ కు చెందిన వారే అని పోలీసు అధికారులు అంటున్నారు. నిందితుల నుంచి రూ. 2 కోట్ల విలువైన కంప్యూటర్లు, విలువైన వస్తువులు రూ. 18 లక్షల నగదు సీజ్ చేశామని బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పోలీసులు తెలిపారు.

English summary
Cheating: Fake call centre busted in Bengaluru city in Karnataka, 11 held for duping US citizens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X