Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Secret: ఫస్ట్ భార్యతో ఎంజాయ్, రెండో భార్యతో రొమాన్స్, మూడో భార్యతో మస్త్ మజా, ఆంటీతో ? పోటుగాడు !

చెన్నై/కరూర్: ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న కేటుగాడు ఇంట్లో చూసిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. భార్యతో ఎంజాయ్ చేసిన ఓ బిడ్డ పుట్టిన తరువాత భర్త టేస్టు మార్చాలని అనుకున్నాడు. పని చేస్తున్న బ్యాంకులోనే ఉద్యోగం చేస్తున్న మరో యువతితో కొంతకాలం అక్రమ సంబంధం పెట్టుకున్న కాలాంతకుడు తరువాత డబ్బు కోసం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో రొమాన్స్ చేసి ఆమె దగ్గర బంగారు నగలు, నగదు ఇప్పించుకున్నాడు. రెండో భార్యతో ఎంజాయ్ చేస్తున్న కిలాడి మరో యువతిని వివాహం చేసుకుని ఆమెతో మస్త్ మజా చేస్తున్నాడు. తన భర్త మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని మొదటి భార్యకు తెలిసిపోయింది. కట్నకానుకలు వస్తాయని కేటుగాడి తల్లిదండ్రులు కూడా అతని పెళ్లిళ్లకు సహకరించారని తెలుసుకున్న మొదటి భార్య అందరి మీద కేసు పెట్టడం కలకలం రేపింది. ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న నిత్య పెళ్లి కొడుకు రాసలీలలు గురించి తెలుసుకున్న పోలీసులు అతని భరతం పట్టి అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం

ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం

తమిళనాడులోని కరూర్ జిల్లాలోని వెంకటమేడులోని వీవీజీ ఏరియాలో నివాసం ఉంటున్న రామస్వామి కుమారుడు బాలసుబ్రమణ్యం కరూరులోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. తమిళనాడులోని పొల్లాచ్చిలోని అరటి కొమ్ము ప్రాంతంలో నివాసం ఉంటున్న సదాశివమ్ కుమార్తె జ్యోతి మురగేశ్వరితో 2012 జనవరి 30వ తేదీన బాలసుబ్రమణ్యం వివాహం జరిగింది.

భార్యతో ఎంజాయ్

భార్యతో ఎంజాయ్

జ్యోతి మురగేశ్వరిని వివాహం చేసుకున్న బాలసుబ్రమణ్యం అత్తారింటి వారు ఇచ్చిన డబ్బు, బంగారు నగలు కట్నం కింద తీసుకున్నాడు. జ్యోతి మురగేశ్వరి ఆమె భర్త బాలసుబ్రమణ్యంతో పాటు అతని తల్లిదండ్రులతో కలిసి కరూర్ లో నివాసం ఉండేది. భర్త జ్యోతితో ఎంజాయ్ చేసిన బాలసుబ్రమణ్యం తండ్రి అయ్యాడు.

 భార్యను పుట్టింటికి పంపించిన భర్త

భార్యను పుట్టింటికి పంపించిన భర్త


వివాహం అయిన వెంటనే జ్యోతి గర్బవతి అయ్యింది. 2012 డిసెంబర్ లో జ్యోతి ఆమె పుట్టింటికి వెళ్లింది. 2013 జనవరి 1వ తేదీన జ్యోతికి మగబిడ్డ పుట్టాడు. అత్తారింటికి వెళ్లిన బాలసుబ్రమణ్యం అతని భార్య జ్యోతిని, కొడుకును చూసి మరుసటి రోజు వెళ్లిపోయాడు. తరువాత నేను మీ ఇంటికి వస్తానని జ్యోతి ఆమె భర్త బాలసుబ్రమణ్యంకు చెప్పింది.

టార్చర్ పెట్టి తరిమేశాడు

టార్చర్ పెట్టి తరిమేశాడు


కొడుకుతో పాటు జ్యోతి ఆమె భర్త బాలసుబ్రమణ్యం ఇంటికి వెళ్లింది. కొడుకు పుట్టిన కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం భర్త బాలసుబ్రమణ్యం, అతని తల్లిదండ్రులు జ్యోతిని టార్చర్ పెట్టి పుట్టింటికి తరిమేశారు. నువ్వు నేను చెప్పిన డబ్బులు తీసుకుని వచ్చే వరకు నా ఇంటికి రానివ్వనని బాలసుబ్రమణ్యం అతని భార్య జ్యోతికి తేల్చి చెప్పాడు. కట్నం డబ్బులు తీసుకెళ్లడానికి అవకాశం లేకపోవడంతో జ్యోతి ఆమె పుట్టింటిలోనే ఉండిపోయింది.

బ్యాంకులో ప్రియురాలు

బ్యాంకులో ప్రియురాలు


భార్య జ్యోతి పుట్టింటికి వెళ్లిపోయిన తరువాత బ్యాంకులో తనతోపాటు బంగారు నగల అప్రైజర్ గా పని చేస్తున్న నిత్య అనే మహిళను బాలసుబ్రమణ్యం లైన్ లో పెట్టాడు. నిత్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న బాలసుబ్రమణ్యం మొదటి భార్య లేనిలోటు ఆమెతో తీర్చుకున్నాడని సమాచారం.

నిత్యాతో రొమాన్స్

నిత్యాతో రొమాన్స్

నిత్యాతో ఎంజాయ్ చేస్తున్న బాలసుబ్రమణ్యం బంగారు నగలు, నగదు కోసంఆశపడి 2017 నవంబర్ నెలలో నిత్యాను వివాహం చేసుకుని ఆమెతో కాపురం పెట్టేశాడు. రెండో భార్య నిత్యాతో రొమాన్స్ చేస్తున్న బాలసుబ్రమణ్యం ఆమెకు వచ్చే జీతంతో జల్సాలు చేస్తున్నాడని అతని మొదటి భార్య జ్యోతికి తెలిసింది.

కరోనా ముందు మూడో పెళ్లి

కరోనా ముందు మూడో పెళ్లి


రెండో భార్య నిత్యాతో ఎంజాయ్ చేస్తున్న బాలసుబ్రమణ్యంకు కరోనా వైరస్ రాకముందే అతని శరీరంలో కామం అనే వైరస్ రగిలిపోయింది. 2020 జనవరి నెలలో సుధా అనే మహిళను వివాహం చేసుకున్న బాలసుబ్రమణ్యం మూడో అకౌంట్ తెరిచాడు. మూడో భార్య సుధాతో మస్త్ మజా చేస్తున్న బాలసుబ్రమణ్యం హ్యాపీగా ఎంజాయ్ చేశాడు.

 మొదటి భార్యకు తెలిసి మొగుడి మైండ్ బ్లాక్

మొదటి భార్యకు తెలిసి మొగుడి మైండ్ బ్లాక్

తనకు విడాకులు ఇవ్వకుండానే నిత్యా అనే మహిళను రెండో పెళ్లి, సుధా అనే మహిళను మూడో పెళ్లి చేసుకున్న భర్త బాలసుబ్రమణ్యం స్టోరీ మొత్తం జ్యోతికి తెలిసింది. బాలసుబ్రమణ్యం ఊరిలో ఉంటున్న వ్యక్తి ద్వారా పొల్లాచ్చిలో ఉన్న జ్యోతి మొత్తం వ్యవహారం తెలుసుకుంది. అంతే తన భర్త బాలసుబ్రమణ్యం భరతం పట్టాలని డిసైడ్ అయిన జ్యోతి అతని మూడు పెళ్లిళ్ల గురించి సాక్షాలతో సహా మొత్తం ఆధారాలు సేకరించింది.

నా మొగుడు కాలాంతకుడు

నా మొగుడు కాలాంతకుడు


తన భర్త తనను మోసం చేసి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, అతనికి మరో ఆంటీతో కూడా అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ జ్యోతి కరూర్ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. నా భర్త బాలసుబ్రమణ్యం ఆడవాళ్లకు మాయమాటలు చెప్పడంతో ఆరితేరిపోయాడని, అతను కాలాంతకుడు అని జ్యోతి పోలీసులకు చెప్పింది. తన భర్త మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి అతని తల్లిదండ్రులు సహకరించారని, నా అత్తామామకు డబ్బు, బంగారు నగల పిచ్చి పట్టిందని బాలసుబ్రమణ్యం భార్య మొదటి జ్యోతి ఆరోపించింది.

Recommended Video

    Ind Vs Aus : Steve Smith Angry Over Cheating Allegations | నిజమే.. స్మిత్ ఎలాంటి తప్పు చేయలేదు..!!
     జైల్లో మొగుడు......రెండో భార్య ఎస్కేప్

    జైల్లో మొగుడు......రెండో భార్య ఎస్కేప్


    జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలసుబ్రమణ్యంను అరెస్టు చేశారు. తన జీవితనం నాశనం కావడానికి తన భర్త బాలసుబ్రమణ్యం రెండో భార్య నిత్యా కూడా కారణం అని జ్యోతి కేసు పెట్టింది. బాలసుబ్రమణ్యంను అరెస్టు చేసిన పోలీసులు పారిపోయిన అతని తల్లిదండ్రులు, అతని రెండో భార్య నిత్యా కోసం గాలిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+