Cheating: కోర్టుకు తిరుగుతున్న ఫస్ట్ భార్య, రెండో భార్య, మూడో భార్యతో భర్త రొమాన్స్, కలెక్టర్ ఎంట్రీతో !

చెన్నై/ తిరునల్వేలి: భర్త టార్చర్ ఎక్కువ కావడంతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్య ఇద్దరు కూతుర్లు బాగోగులు చూసుకోవడానికి భరణం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. ప్రతినెల భార్య, పిల్లలకు డబ్బు ఇవ్వాలని కోర్టు భర్తకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను భర్త పట్టించుకోలేదు. భర్త డబ్బులు ఇవ్వడం లేదని, కూతుర్లను పోషించడం కష్టంగా ఉందని భార్య మరోసారి కేసు పెట్టింది. ఇదే సందర్బంలో భర్త మరో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న భార్య బిత్తరపోయింది, నా భర్త కాలాంతకుడు, అతని మీద చర్యలు తీసుకోవాలని భార్య జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.

ఇద్దరు కుమార్తెలు

ఇద్దరు కుమార్తెలు

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని పొన్నకుడి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఏంజెల్ అనే మహిళ 2009లో కురుంపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ముత్తుకుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేసిన ముత్తుకుమార్, ఏంజిల్ దంపతులకు అబిషా, అజిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

భర్త మీద కేసు పెట్టిన భార్య

భర్త మీద కేసు పెట్టిన భార్య

నిత్యం మద్యం సేవించి ఇంటికి వెలుతున్న ముత్తుకుమార్ అతని భార్య ఏంజిల్ ను చితకబాదేవాడని తెలిసింది. ముత్తుకుమార్ కుటుంబ సభ్యులు కట్నం తీసుకురావాలని ఏంజిల్ ను వేధించారని ఆరోపణలు ఉన్నాయి. భర్త ముత్తుకుమార్ టార్చర్ ఎక్కువ కావడంతో అతని మీద ఏంజిల్ మూడు సంవత్సరాల క్రితం శ్రీవైకుండం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

కోర్టును ఆశ్రయించిన భార్య

కోర్టును ఆశ్రయించిన భార్య

భార్య ఏంజిల్ కేసు పెట్టడంతో ముత్తుకుమార్ అతని పలుకుబడి ఉపయోగించి పోలీస్ స్టేషన్ లో కేసు లేకుండా చేసుకుని అతని భార్యతో రాజీ పంచాయితీలు చేసి బయటపడిపోయాడు. తరువాత భర్త ముత్తుకుమార్ టార్చర్ పెట్టడంతో పుట్టింటికి వెళ్లిపోయిన ఏంజిల్ ఆమె ఇద్దరు కూతుర్ల బాగోగులు చూసుకోవడానికి భర్త ముత్తుకుమార్ నుంచి తనకు భరణం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది.

కోర్టు ఆదేశాలను పట్టించుకోని భర్త

కోర్టు ఆదేశాలను పట్టించుకోని భర్త

ఏంజిల్ పిటిషన్ విచారణ చేసిన కోర్టు ప్రతినెల భార్య, పిల్లలకు రూ. 9,000 డబ్బు ఇవ్వాలని 2020లో కోర్టు ముత్తుకుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోని ముత్తుకుమార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు భార్య ఏంజిల్ కు భరణం చెల్లించకుండా అతనిపని అతను చూసుకుంటున్నాడు.

అసలు మ్యాటర్ తో హడలిపోయి భార్య

అసలు మ్యాటర్ తో హడలిపోయి భార్య

తన భర్త ముత్తుకుమార్ ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదని, కోర్టు ఆదేశాలను అతను పట్టించుకోవడం లేదని, కూతుర్లను పోషించడం కష్టంగా ఉందని ఏంజిల్ మళ్లీ ఆమె భర్త మీద కేసు పెట్టింది. తన భర్త ముత్తుకుమార్ ఎక్కడ ఉన్నాడు ?, ఏం చేస్తున్నాడు ? అంటూ ఏంజిల్ ఆరా తీసింది. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలను పోషించలేక సతమతం అవుతున్న ఏంజిల్ ఆమె భర్త ముత్తుకుమార్ గురించి అసలు మ్యాటర్ తెలుసుకుని హడలిపోయింది.

ఇంకా ఇద్దరిని పెళ్లి చేసుకున్న పోటుగాడు

ఇంకా ఇద్దరిని పెళ్లి చేసుకున్న పోటుగాడు

తనను వదిలేసిన తన భర్త ముత్తుకుమార్ మరో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న ఏంజిల్ రగిలిపోయింది. మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న అరుల్ అన్బుసెల్వీ అనే మహిళతో పాటు మరో మహిళను ముత్తుకుమార్ పెళ్లి చేసుకున్నాడని ఏంజిల్ తెలుసుకుంది.

జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

తనకు విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నాడని, అతను నన్ను, నాబిడ్డలను మోసం చేశాడని, నా భర్తతో పాటు అతన్ని పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు, నా భర్త కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకోవాలని ఏంజిల్ తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోని నా భర్త ముత్తుకుమార్ ను కఠినంగా శిక్షించాలని ఏంజిల్ జిల్లా కలెక్టర్ కు మనవి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+