వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cheating: బాగా డబ్బున్న యువతులు టార్గెట్, మొబైల్ కంపెనీలో నేను ?, 30 మందిని ముంచేశాడు !

|
Google Oneindia TeluguNews

ముంబాయి: మ్యాట్రీమోనీ వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇచ్చి మహిళల నుంచి రూ. లక్షలాది రూపాయలు వసూలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువకుడు తప్పుడు సమాచారం ఇచ్చి మ్యాట్రీమెనీ వెబ్‌సైట్‌లో అతను అనేక పేర్లతో నమోదు చేస్తూ మహిళలపై మోసాలకు పాల్పడుతున్నాడు. ఇందుకోసం పలుకుబడి ఉన్న మహిళలపై వల విసురుతున్నాడు. అతను కూడా ఒక పెద్ద మొబైల్ కంపెనీలో కీ ప్లేయర్‌గా అమాయకులైన మహిళలకు పరిచయం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఆ యువకుడు దాదాపు 30 మందికి పైగా మహిళలపై ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడని వెలుగు చూడటంతో పోలీసులు హడలిపోయారు.

Wife: భార్యను చంపేయాలని డాక్టర్ ను వేడుకున్న భర్త, లేదంటే కష్టాలు వస్తాయని డాక్టర్ కే వార్నింగ్, 420!Wife: భార్యను చంపేయాలని డాక్టర్ ను వేడుకున్న భర్త, లేదంటే కష్టాలు వస్తాయని డాక్టర్ కే వార్నింగ్, 420!

అందమైన యువతి

అందమైన యువతి


ముంబైలోని కంజుర్‌మార్గ్‌లో 28 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. ఈమె ఓ మ్యాట్రీమోనీ వెబ్‌సైట్‌లో ఆమె వివరాలు నమోదు చేసింది. అది చూసి విశాల్ చౌహాన్ అనే యువకుడు ఆమెకు ఫోన్ చేశాడు. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం అలవాటు చేసుకున్నారు. మహిళ యొక్క ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు తెలసుకున్న విశాల్ చౌక్ష్ాపక తన తల్లిదండ్రుల అత్యవసర వైద్య సేవల కోసం రూ. 2. 5 లక్షల రూపాయలు అడిగాడు. అతడి మాటలను నమ్మిన మహిళ ఆ యువకుడి బ్యాంకు ఖాతాకు కూడా డబ్బులు పంపింది.

జెండా ఎత్తేసిన కేటుగాడు

జెండా ఎత్తేసిన కేటుగాడు


యువతి దగ్గర డబ్బులు తీసుకున్న విశాల్ చౌహాన్ తరువాత జెండా ఎత్తేశాడు. బాధితురాలు విశాల్ కు ఫోన్ చేసినా అతని ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ ముంబాయిలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బ్యాంకు ఖాతా కోసం పోలీసులు వెతికినప్పుడు అది నకిలీ చిరునామా అని వెలుగు చూసింది.

మరో మహిళకు రూ. 17 లక్షలు టోపీ

మరో మహిళకు రూ. 17 లక్షలు టోపీ

పోలీసులు మహిళకు రూ. 2. 5 లక్షలు నామం పెట్టిన విశాల్ చౌహాన్ కోసం గాలించడం మొదలు పెట్టారు. అదే సమయంలో మరో మహిళ విశాల్ చౌహాన్ కు సన్నిహితంగా మెలిగిందని, ఆమె అతని మాయమాటలు నమ్మి రూ.17 లక్షలు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టినట్లు ఇప్పటికే ముంబాయిలోని జియాన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని వెలుగు చూసింది.

 కేటుగాడు చిక్కిపోయాడు

కేటుగాడు చిక్కిపోయాడు

పోలీసులు పలు టీమ్ లు ఏర్పాటు చేసి చివరికి విశాల్ చౌహాన్ ను పట్టుకున్నారు. పలుకుబడి ఉన్న మహిళలపై విశాల్ చౌహాన్ వల విసురుతున్నాడు. విశాల్ చౌహాన్ కూడా తాను ఒక పెద్ద మొబైల్ కంపెనీలో కీ ప్లేయర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఆ యువకుడు దాదాపు 30 మందికి పైగా మహిళలను ఇలాగే మోసం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. విశాల్ చౌహాన్ అమాయకులైన యువతులను టార్గెట్ చేసుకుంటున్నాడని, కొంతకాలం వారి దగ్గర డబ్బులు, నగలు ఎంత మాత్రం ఉన్నాయి అంటూ మొత్తం ఆరా తీశాడని పోలీసులు అంటున్నారు. ఎవరివలనైనా ఇబ్బందులు వస్తాయి అని అనుమానం ఉంటే అలాంటి మహిళలను వీలైనంత త్వరగా దూరం పెట్టేవాడని, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు అని నిర్దారించుకున్న తరువాత రంగంలోకి దిగుతున్నాడని, ఇప్పటి వరకు సుమారు 30 మందికి కుచ్చుటోపీ పెట్టాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

English summary
Cheating: Young man dupes over 33 women on matrimonial sites, arrested in Mumbai City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X