చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ
భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ గడ్డపై పరుగు తీస్తున్న చీతాల కుటుంబం ఇప్పుడు 'అర్ధసెంచరీ' మార్కును దాటేసింది. కూనో నేషనల్ పార్క్‌లో నమీబియా చీతా 'జ్వాల' ఐదు పసికూనలకు జన్మనివ్వడంతో భారత్ తన చీతా పునరుద్ధరణ లక్ష్యంలో మరో మైలురాయిని చేరుకుంది.
భారతదేశ ప్రతిష్టాత్మక 'ప్రాజెక్ట్ చీతా' సరికొత్త రికార్డును సృష్టించింది. మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో నమీబియా నుంచి వచ్చిన 'జ్వాల' అనే చీతా సోమవారం ఐదు ఆరోగ్యకరమైన కూనలకు జన్మనిచ్చింది. ఈ కొత్త అతిథుల రాకతో దేశంలో మొత్తం చీతాల సంఖ్య 53కు చేరుకుంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ సంతోషకరమైన వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, ఇది వన్యప్రాణి సంరక్షణలో ఒక చారిత్రక ఘట్టమని అభివర్ణించారు.

భారత గడ్డపై పెరుగుతున్న సంతతి..
ప్రస్తుతం ఉన్న 53 చీతాలతో.. 50 కూనో నేషనల్ పార్క్‌లో ఉండగా, మరో మూడు మధ్యప్రదేశ్‌లోని గాంధీ సాగర్ అభయారణ్యంలో సంరక్షణలో ఉన్నాయి. విశేషమేమిటంటే, భారత్‌లో పుట్టి పెరుగుతున్న చీతా కూనల సంఖ్య ఇప్పుడు 33కు పెరిగింది. ఇది భారత గడ్డపై 10వ విజయవంతమైన సంతానోత్పత్తి కాగా, 'జ్వాల' మూడోసారి పిల్లలకు జన్మనిచ్చి తన ప్రత్యేకతను చాటుకుంది. "చిరుతల సంఖ్య అర్ధశతకం దాటడం ప్రాజెక్ట్ చీతాకు గర్వకారణం" అని మంత్రి భూపేందర్ యాదవ్ కొనియాడారు.
సంరక్షకుల కృషికి దక్కిన ఫలితం
ఈ అద్భుత విజయం వెనుక పశువైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం దాగి ఉంది. 1952లో దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టేందుకు 2022 సెప్టెంబర్ 17న ప్రపంచంలోనే తొలి ఖండాంతర చీతా రవాణా ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఆ ప్రయాణం నేడు 53 జీవాల స్థాయికి చేరుకోవడం విశేషం. గత ఫిబ్రవరిలో బొట్స్‌వానా నుండి మరో 9 చీతాలను తీసుకువచ్చి కూనోలో వదలడంతో ఈ ప్రాజెక్టు మరింత వేగం పుంజుకుంది.
జ్వాలతో పాటు.. పుట్టిన ఐదు కూనలు క్షేమంగా ఉన్నాయని, ఇవి భారతదేశ చీతాల పునరుద్ధరణ కథను ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తాయని అటవీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Cheetahs cross half-century 🐆
— Bhupender Yadav (@byadavbjp) March 9, 2026
A moment of great pride for Project Cheetah as Jwala, the Namibian Cheetah and a successful third-time mother, gave birth to five cubs today at the Kuno National Park.
With this birth, the number of Indian-born thriving cubs has risen to 33,… pic.twitter.com/tzxYYmLPtM
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications