చెన్నైలో కూలిన భవనం: మృతుల్లో తెలుగువారు

శనివారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించడంతో అప్పటికే పెక్కుమంది పని పూర్తి చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. భవనం శిథిలాల నుంచి బాధితుల ఆక్రందనలు వినిపిస్తున్నాయని సహాయ కార్యక్రమాలలో పాల్గొన్న అధికారులు చెబుతున్నారు. మృతులు ఉత్తరాంధ్రకు చెందినవారని తెలుస్తున్నది. భవనంలో 11 అంతస్తుల నిర్మాణం ఇప్పటివరకు పూర్తి అయ్యింది.
శనివారంనాడు చెన్నైలో కుండపోతగా వర్షం కురిసింది. దీనివల్లే ప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నా. భవనం కూలిపోయిన విషయం తెలిసిన వెంటనే అరక్కోణంనుంచి జాతీయ విపత్తు నివారణకు చెందిన అధికారుల ఆధ్వర్యంలో ఒక హెలికాప్టర్ బయలుదేరింది. అగ్నిమాపక దళ సిబ్బంది, వైద్యులు కూడా హుటాహుటిన తరలివచ్చారు. అధికారులు భవనం శిథిలాలను తొలగిస్తున్నారు. చెన్నైలోని పోరూరులో గల ముగలివాక్కం ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ భవన నిర్మాణానికి వచ్చిన వారిలో పెక్కుమంది విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలనుంచి ఉపాధి కోసం వచ్చినవారే. విజయనగరంలోని మక్కువ, దత్తరాజేరు మొదలైన ప్రాంతాలకు చెందిన కూలీలు దాదాపు 15 మంది ఉన్నట్టు విజయనగరం కలెక్టర్‌కు ప్రాథమిక సమాచారం అందింది. అయితే 14 మంది విజయనగరం జిల్లావారు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి చిన్నరాజప్ప అన్నారు. ప్రమాదం సంభవించిన ప్రాంతంలో ఇప్పటివరకూ ఐదు అంతస్తుల నిర్మాణానికే అనుమతి ఉంది. 11 అంతస్తుల నిర్మాణానికి తొలిసారిగా అధికారులు అనుమతి ఇచ్చారు.
మృతుల్లో విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురున్నట్లు తెలుస్తోంది. బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్నవారి విషయపయమై మంత్రి మృణాళిని ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్నవారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
చెన్నైకి ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ బయలుదేరి వెళ్లారు. తమిళనాడు ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి మృణాళిని చెప్పారు. చెన్నైకి ప్రభుత్వ బృందాన్ని పంపుతన్నట్లు తెలిపారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే చెప్పారు
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications