బాల్కనీపై పడిన చిన్నారి వైరల్ వీడియో: సోషల్ మీడియా ట్రోల్స్‌తో తల్లి ఆత్మహత్య
చెన్నై: సోషల్ మీడియాతో మంచి ఎంత జరుగుతుందో.. చెడు కూడా అంతే జరుగుతోంది. ఇటీవల ఓ అపార్ట్‌మెంట్ పైకప్పుపై ఓ చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ ఉన్న వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ చిన్నారిని కొందరు కాపాడారు. అయితే, ఈ ఘటనలో ఆ చిన్నారి తల్లి నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు మహిళ బలవన్మరణానికి పాల్పడింది.
ఈ విషాద ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. ఇటీవల చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్ పైకప్పు ప్లాస్టిక్ షీట్‌కు ఓ చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ ఉన్న వీడియో వైరల్‌గా మారింది. ఇదే ఘటనపై నెటిజన్లు వ్యవహరించిన తీరు ఇప్పుడా బిడ్డకు తల్లిని దూరం చేయడం శోచనీయం. నెట్టింట విమర్శలు తట్టుకోలేక ఆ చిన్నారి తల్లి ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 28న చెన్నైలో ఓ 8నెలల శిశువు అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీ రేకులపై ప్రమాదకరంగా వేలాడుతుండగా.. గమనించిన స్థానికులు రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో చిన్నారిని రక్షించిన వారిని ప్రశంసించిన నెటిజన్లు.. అదే సమయంలో చిన్నారి తల్లి విషయంలో అభ్యంతరకరంగా వ్యవహరించారు. కన్న బిడ్డను కూడా చూసుకోవడం చేతకాదా? అంటూ తల్లి రమ్యను విమర్శించారు. ఎంతకీ ఈ ట్రోల్స్ ఆగకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది.
ఈ ఘటన తర్వాత డిప్రెషన్‌కు గురైన రమ్య.. కోయంబత్తూరులోని తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రమ్య ఆదివారం ఇంట్లోని కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. వారు తిరిగి వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ కారణంగా ఆమె మానసికంగా కుంగిపోయిందని, దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
People like @itisprashanth and those who have shamed the parent/s under this Tweet
— Chinmayi Sripaada (@Chinmayi) May 19, 2024
All these human creations can perhaps celebrate now since the mother of this child has now killed herself. https://t.co/z8j45UcqwV https://t.co/lJ4IORzXKA
అయితే, రమ్య తన బిడ్డను ఎంతో ప్రేమ చూసుకునేదంటూ స్థానికులు చెబుతున్నారు. తన బిడ్డను బాగా చూసుకుంటుందని, అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతుంటాయని బాసటగా నిలిచారు. ఈ ఘటనపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కొందరు నెటిజన్లు విచక్షణ మరిచి చేసిన వ్యాఖ్యల వల్లే ఆ చిన్నారి తల్లి ఆత్మహత్య చేసుకుందన్నారు. 'మీ ట్రోల్స్ వల్ల చిన్నారి తల్లి మరణించింది. ఇప్పుడు మీ కళ్లు చల్లబడ్డాయా' అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో అతి స్పందించడం వల్లే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications