Chennai: శాడిస్టు, కాలేజ్ అమ్మాయి, తండ్రి ప్రాణం పోయింది, ఇప్పుడు లేడీ హెడ్ కానీస్టేబుల్ !
చెన్నై: దంపతులు హ్యాపీగా జీవించారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు. భార్య పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తోంది. తల్లిదండ్రులు వారి కుమార్తెలను పిల్లలుగా కాకుండా స్నేహితుల్లా చూసుకున్నారు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు కూతుర్లు మురిసిపోయారు. అయితే ఓ మాజీ పోలీసు అధికారి కొడుకు కారణంగా ఆ ఫ్యామిలీ కేవలం ఆరు నెలల్లో సర్వ నాశనం అయ్యింది. శాడిస్టు యువకుడు కాలేజ్ లో చదువుతున్న కూతుర్ని చంపేశాడు. ఆవేదనతో అదే రోజు తండ్రి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇక హెడ్ కానీస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న తల్లి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ముచ్చటైన ఫ్యామిలీ
చెన్నైలోని ఆలందూరు రాజా వీధి పోలీస్ క్వార్టర్స్‌లో నివాసముండే మాణిక్యం (47). ఇతని భార్య రామలక్ష్మి (43) దంపతులు సంతోషంగా జీవించారు. ఆదంపాక్కం పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ బ్రాంచ్‌లో రామలక్ష్మి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె సత్యప్రియా(20) టీ.నగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీసీఏ మూడో సంవత్సరం చదివేది. మాణిక్యం, రామలక్ష్మి దంపతులకు 7 సంవత్సరాల వయసు ఉన్న మరో కూతురు ఉంది.

కాలేజ్ కు వెళ్లాలని రైల్వేస్టేషన్ లో యువతి
అలందూరు రాజా వీధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ పోలీస్ అధికారి దయాళన్ కుమారుడు సతీష్ అనే యువకుడు సత్యప్రియా(20)ని ప్రేమిస్తున్నట్లు సమాచారం. కానీ సత్యప్రియా మాత్రం సతీష్ ప్రేమను తిరస్కరించింది. ఇదే విషయంలో సత్యప్రియా, సతీష్ ల మధ్య కొన్ని సార్లు వాగ్వివాదం జరిగిందని తెలిసింది. గత ఏడాది అక్టోబర్ 13న సత్యప్రియా తన స్నేహితురాలితో కలిసి కళాశాలకు వెళ్లేందుకు పరంగిమలై రైల్వే స్టేషన్‌లో వేచి ఉంది.

రైలు కింద తోసి చంపేసిన శాడిస్టు ప్రియుడు
సతీష్ అక్కడికి వచ్చి సత్యప్రియాను ప్రేమించాలని చెప్పాడు. అ సమయంలో సత్యప్రియా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్పింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన సతీష్ వేగంగా వెలుతున్న రైలు కిందకు సత్యప్రియాను తోసేశాడు. రైలు ఢీకొని సత్యప్రియా స్పాట్ లో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో పోలీసులు సతీష్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. కుమార్తె మృతితో మనస్తాపానికి గురైన సత్యప్రియా తండ్రి మాణిక్యం అదే రోజు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరు నెలల క్రితం ఈ సంఘటన తమిళనాడులో కలకలం రేపింది.

లేడీ హెడ్ కానీస్టేబుల్ ప్రాణం పోయింది
ఆదంబాక్కంలో హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్న సత్యప్రియా తల్లి రామలక్ష్మి తన 7 సంవత్సరాల కుమార్తెతో కలిసి పోలీసు క్వాటర్స్ లోనే నివసిస్తున్నారు. క్యాన్సర్‌తో వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామలక్ష్మి ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా ఉన్న సత్యప్రియా 7 ఏళ్ల చెల్లెలు ఇప్పుడు అనాథ కావడంతో ఆ ప్రాంత ప్రజలు విషాదం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో కుటుంబంలోని ముగ్గురు చనిపోవడంతో ఆ బాలిక ఇప్పుడు రోడ్డునపడింది.












Click it and Unblock the Notifications