• search

ఘోరం: 11ఏళ్ల బాలికపై 17మంది నెలలపాటు రేప్, నిందితులను చితకబాదిన లాయర్లు

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   11ఏళ్ల బాలికపై 17మంది నెలలపాటు రేప్, నిందితులను చితకబాదిన లాయర్లు

   చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో వినికిడి లోపం ఉన్న 11ఏళ్ల బాలికపై ఆ భవనంలో పనిచేస్తున్న వ్యక్తులు కొన్ని నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 17మందిని అరెస్ట్‌ చేశారు.

   భవనం సెక్యురిటీ గార్డు, లిఫ్ట్‌ బాయ్‌, నీళ్లు సరఫరా చేసే వ్యక్తులు కూడా అరెస్ట్‌ చేసిన వారిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలికకు మత్తు మందు కలిపిన పానీయాలు ఇచ్చి కిరాతకానికి పాల్పడ్డారని, తర్వాత ఆమెను బెదరించారని తెలిపారు. వారిని మంగళవారం కోర్టుకు తీసుకురాగా న్యాయవాదులే మూకుమ్మడిగా నిందితులపై దాడి చేశారు.

   మత్తు మందిచ్చి ఘోరం..

   మత్తు మందిచ్చి ఘోరం..

   చెన్నైలోని అయణవరం ప్రాంతంలో ఉన్న ఓ అపార్టుమెంటులో బాలిక నివసిస్తోంది. 7వ తరగతి చదువుతున్న ఈ బాలికపై అత్యాచారం చేసే ముందు నిందితులు ఆమెకు మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం, మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయాలను తాగించడం, పొడి రూపంలో ఉన్న మాదక ద్రవ్యాలను ముక్కుతో పీల్చేలా చేసేవారని వెల్లడించారు. బాలికపై దారుణానికి పాల్పడుతూ వీడియోలు కూడా తీశారన్నారు.

    7నెలలపాటు ఘాతుకం

   7నెలలపాటు ఘాతుకం


   తొలుత లిఫ్ట్‌ ఆపరేటర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడగా, ఆ తర్వాత పలువురు అతనికి జత కలిసి 7 నెలల పాటు ఆమెను అత్యాచారాన్ని చేస్తూ హింసించారని పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని బాలిక తన అక్కకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాలిక తండ్రి జులై 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

   నిందితుల తరపున వాదించకూడదని లాయర్లు

   నిందితుల తరపున వాదించకూడదని లాయర్లు


   ‘11 మంది తనపై అత్యాచారం చేశారని అమ్మాయి చెప్పింది. వారికి సహకరించిన మరో ఆరుగురిని కూడా కలిపి మొత్తం 17 మందిని అరెస్టు చేశాం' అని పోలీసులు చెప్పారు. దీన్ని ప్రత్యేకమైన కేసుగా పరిగణించి విచారణ చేస్తున్నామన్నారు.
   నిందితుల తరఫున ఏ లాయరూ వాదించరని న్యాయవాదుల సంఘం తేల్చి చెప్పింది. కోర్టు నిందితులకు జూలై 31 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

   నిందితులను చితకబాదిన లాయర్లు

   నిందితులందరినీ మంగళవారం పోలీసులు మహిళా కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు నిందితులను కోర్టు నుంచి బయటకు తీసుకొస్తుండగా అక్కడ ఉన్న దాదాపు 50 మంది న్యాయవాదులు వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో నిందితులను రెండు గదుల్లో ఉంచి పోలీసులు రక్షణ కల్పించారు. లాయర్లకు భయపడి దాదాపు 5 గంటలు వారంతా ఆ గదుల్లోనే ఉన్నారు. రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో లాయర్లు శాంతించడంతో నిందితులను కస్టడీకి తరలించారు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   An 11-year-old girl was raped over several weeks at an apartment complex in Chennai, allegedly by 17 men including security guards, electricians and plumbers. The men, arrested today, were thrashed by lawyers and others as they were taken to court, in a reflection of spiraling anger and shock at the child's assault.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more