gang leader: ఆంధ్రా సుబ్బారావ్ తో పెట్టుకుంటే అడ్రాస్ లేకుండా పోయింది, హైకోర్టు లాయర్ స్కెచ్ తో ?
ఆంధ్రా సుబ్బారావ్ దెబ్బతో గ్యాంగ్ లీడర్ తో పాటు కిలాడీ టీమ్ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. ఈ గ్యాంగ్ లో మహిళతో పాటు హైకోర్టు లాయర్ కూడా ఉండటంతో పోలీసులు హడలిపోయారు.
చెన్నై/తిరుపతి: పొరుగున ఉన్న రాష్ట్రం నుంచి బంగారు నగలు కొనుగోలు చెయ్యడానికి వచ్చేవారిని టార్గెట్ చేశారు. భారీ మొత్తంలో డబ్బుతో బంగారు నగలు కొనుగోలు చెయ్యడానికి వచ్చిన వారిని ఫాలో అయ్యి వివిద రకాలుగా వారిని బెదిరించి లూటీలు చేస్తున్నారు. పోలీసు అధికారులు, ఐటీ అధికారులు అంటూ వారిని బెదిరించి డబ్బులు లూటీ చేశారు ఆంధ్రా సుబ్బారావ్ దెబ్బతో కిలాడీ టీమ్ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. ఈ గ్యాంగ్ లో మహిళతో పాటు హైకోర్టు లాయర్ కూడా ఉండటంతో పోలీసులు హడలిపోయారు.

చెన్నై సిటీలో స్కెచ్
ఆంధ్రప్రదేశ్ నుంచి బంగారు నగలు కొనుగోలు చేసేందుకు సుబ్బారావు, రఘురామ్ అనే ఇద్దరు నగల వ్యాపారులు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని చెన్నై చేరుకున్నారు. సుబ్బారావ్, రఘురామ్ ను వారి వెంట తెచ్చుకున్న రూ.1. 40 కోట్ల డబ్బుతో చెన్నైలోని షావుకార్ పేటలో వెలుతున్న సమయంలో తెల్లవారుజామున కొంరు నిందితులు బెదిరించి ఆ డబ్బు మొత్తం దోచుకుని వెళ్లారు.

సుబ్బారావ్ దెబ్బ
బాధితులు సుబ్బారావ్ తో పాటు రఘురామ్ చెన్నైపోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలించారు. ఈ దోపిడీ ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్ లీడర్ ఇమ్రాన్‌ను ప్రత్యేక బలగాల పోలీసులు తమిళనాడులోని ఊటీలో అరెస్టు చేశారు. ఆతరువాత గ్యాంగ్ లీడర్ ఇమ్రాన్ సోదరుడు ఇమ్రాజ్, ఇన్తియాస్, ముంతాజ్‌లను ఒకరి తర్వాత ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

హైకోర్టు లాయర్ అరెస్టు
కోట్ల రూపాయల లాటీ కేసులో ఒకరి తరువాత ఒకరు అరెస్టు కావడంతో ఈ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్న వారు హడలిపోయారు. ఈ క్రమంలో ఇమాన్యుయేల్, అన్బరసన్ అనే ఇద్దరు వ్యక్తులు తమిళనాడులోని తిరుచ్చి కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో హైకోర్టు న్యాయవాది మాధవన్, రాజేష్, అశోక్, పాషా, పాషా భార్య అలీషాలను పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

గ్యాంగ్ లీడర్ మీద ఎన్ని క్రిమినల్ కేసులో తెలుసా ?
ఈ దోపిడీ కేసులో పోలీసులు జరిపిన విచారణలో పలు విస్మయకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టయిన నేరస్తుల్లో ఇమ్రాన్ ప్రధాన నిందితుడని, దోపిడీ ముఠా నాయకుడని వెలుగు చూసింది. ఇమ్రాన్ మీద చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, సీబీసీఐడీ, తమిళనాడులోని వేలూరు, తంజావూరు, విల్లుపురం, గుడియాతం, (ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం), చెన్నైలోని తాంబరం, కొడుంకయ్యూరు, వ్యాసరపాడి తదితర ప్రాంతాల్లో దారి దోపిడీలు, దోపిడీ, హవాలా, మానవ అక్రమ రవాణాతో సహా మొత్తం 17 క్రిమినల్ కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని వెలుగు చూసింది.

సెంట్రల్ జైల్లో ఆంధ్రా వ్యక్తులతో డీల్
ఓ కిడ్నాప్ కేసులో గత డిసెంబర్ నెల వరకు ఇమ్రాన్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. అదేవిధంగా పోలీసులలా నటించి కిడ్నాప్ చేసిన కేసులో జైలులో ఉన్న ఇమ్రాన్ తోపాటు అదే జైలులో ఉన్న ఓ ఖైదీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు నగలు కొనుగోలు చేసేందుకు షావుకార్ పేటకు వస్తారని, వారు ఏ రైలులో వస్తారు, చెన్నైలో ఎక్కడికి వెలుతారు, తరువాత ఏ రైలులో ఆంధ్రప్రదేశ్ కు వెలుతారు అని పూర్తి సమాచారం ఇమ్రాన్ కు చెప్పాడు. వాళ్లు ఎవరి దగ్గర బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అనే పూర్తి సమాచారం ఇమ్రాన్‌కు చెప్పాడు.

సినిమా స్టైల్లో పక్కాప్లాన్
జైలులో సాటి ఖైదీ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఫిబ్రవరి 3వ తేదీ తెల్లవారుజామున ఆంధ్రా జ్యువెలర్స్ సుబ్బారావు, రఘురామ్ లను అడ్డగించిన నిందితులు తాము పోలీసులు అని చెప్పారు. ఇంత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, సరైనా ఆధారాలు, సంబంధిత పత్రాలు చూపించి తరువాత డబ్బులు తీసుకోవాలని బెదిరించి వారి దగ్గర ఉన్న 1. 40 కోట్లు దోచుకున్నారు. చోరీ జరిగిన రోజు ఇమ్రాన్ సోదరుడు ఇమ్రాజ్ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ పరిధిలో ఆటోడ్రైవర్‌గా నటించి సుబ్బారావ్, మరో నగల వ్యాపారి రఘురామ్ వెళ్లే దారి గురించి నిందితులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడంతో నిందితులు పక్కాప్లాన్ తో డబ్బులు లూటీ చేసి ఎస్కేప్ అయ్యారని పోలీసులు చెప్పారు.

హైకోర్టు లాయర్ స్కెచ్ లు
15కు పైగా దోపిడీలకు పాల్పడిన ఇమ్రాన్ అన్ని కేసుల నుంచి తప్పించుకునేందుకు దోచుకున్న సొమ్ముతో బీఏ.బీఎల్ (లా) కోర్సు పూర్తి చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు. దోచుకున్న సొమ్ములో లాయర్లకు విడివిడిగా డబ్బులు కేటాయించి వరుస దోపిడీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. ఆ విధంగా షావుకార్ పేటలో జరిగిన చోరీ దోపిడీకి మద్రాసు హైకోర్టు న్యాయవాది మాధవన్ పథకం పన్నారని, అంతకుముందు జరిగిన దోపిడీల్లో దొంగలకు ఇదే లాయర్ సహకరించాడని వెలుగు చూడటంతో పోలీసులు హడలిపోయారు.

గ్యాంగ్ లీడర్ లగ్జరీ లైఫ్
షావుకారు పేటలో దోచుకున్న డబ్బును తన సహచరులతో పంచుకున్న తర్వాత ఇమ్రాన్ కొడైకెనాల్‌లోని ఓ రిసార్ట్ కు వెళ్లిపోయి అక్కడ ఎంజాయ్ చేశాడు. మిగిలిన నిందితులు ఒక్కొక్కరు ఊటీ, పాండిచ్చేరి, హోసూర్, బెంగళూరు తదితర ప్రాంతాలకు విడివిడిగా ప్రయాణించారు. లూటీలు చేసిన డబ్బుతో ఇమ్రాన్ రెండు ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు. ఇప్పటి వరకు ఇమ్రాన్, ఇమ్రాజ్, ఇల్తియాస్, ముంతాజ్, హైకోర్టు న్యాయవాది మాధవన్, ఇమ్మాన్యుయేల్, అన్బరసన్, రాజేష్, అశోక్, పాషా, పాషా భార్య అలీషా అనే 11 మందిని అరెస్టు చేశారు. అలీషాకు పసిపాపతో ఉండడంతో న్యాయమూర్తి ఆమెను కోర్టు బెయిల్‌పై విడుదల చేశారు. అరెస్టయిన వారి నుంచి ఇప్పటివరకు రూ.70 లక్షల నగదు, దోపిడీలకు కార్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురు వ్యక్తుల కోసం చెన్నై పోలీసులు గాలిస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications