encounter: తమిళనాడు యువకుడిని ఎన్ కౌంటర్ చేసిన సిడ్నీ పోలీసులు, ఆస్ట్రేలియాలో ?
చెన్నై/న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లిన యువకుడు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. వీలుచిక్కినప్పుడు ఇంటికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. విదేశాలల్లో ఉన్నా ఆ యువకుడ నిత్యం అతని స్నేహితులతో టచ్ లో ఉన్నాడు. డబ్బులు సంపాధించాలని విదేశాలకు వెళ్లిన యువకుడు ఆదేశంలోని పోలీసుల ఎన్ కౌంటర్ లో స్పాట్ లో చనిపోయాడు. అసలు ఎం జరిగింది అనే విషయంపై స్థానిక మీడియా పూర్తి సమాచారం వెళ్లడించింది.

తమిళనాడు టూ ఆస్ట్రేలియా
తమిళనాడులోని తంజావూరులోని అతిరామమ్ పట్నంలో మహ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ అలియాస్ సయ్యద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాధించాలని సయ్యద్ అనుకున్నాడు. 2019లో సయ్యద్ విజిటర్స్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు. తరువాత ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ రెస్టారెంట్‌లో సయ్యద్ ఉద్యోగంలో చేశాడు.

సిడ్నీలో నివాసం ఉంటున్న సయ్యద్
ప్రతిరోజు రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్న సయ్యద్ అతని పని పూర్తి అయిన తరువాత లోకల్ మెట్రో రైలులో అతని ఇంటికి వెలుతున్నాడు. ఎప్పటిలాగే సయ్యద్ పని ముగించుకుని ఇంటికి వెళ్లడానికి రైల్వేస్టేషన్ కు బయలుదేరాడు. సిడ్నీలోని పశ్చిమ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్న 28 ఏళ్ల పారిశుద్ధ్య కార్మికుడి దగ్గరకు సయ్యద్ వెళ్లాడు. తరువాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోయింది.

రైల్వేస్టేషన్ లో ఎన్ కౌంటర్
ఆ సందర్బంలో సహనం కోల్పోయిన సయ్యద్ కత్తితో పారిశుద్ద కార్మికుడిని దారుణంగా పొడిచేశాడు. సమీపంలో ఉన్న పోలీసులు విషయం గుర్తించి సయ్యద్ దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో సయ్యద్ అదే కత్తితో పోలీసుల మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని సమాచారం. ఆ సమయంలో లొంగిపోవాలని సిడ్నీ పోలీసులు చెప్పినా సయ్యద్ మాత్రం పట్టించుకోలేదని తెలిసింది.

ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది
సిడ్నీ పోలీసులను లెక్క చెయ్యకుండా మరోసారి వారి మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించడంతో సిడ్నీ పోలీసులు అతడిపై మూడుసార్లు కాల్పులు జరిపారు. సయ్యద్ ఛాతీపై రెండు తుపాకీ తూటాలు దూసుకుపోవడంతో అతను చనిపోయాడని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ మీడియా కథనం వెళ్లడించింది. తమిళనాడుకు చెందిన సయ్యద్ సిడ్నీ పోలీసుల ఎన్ కౌంటర్ లో అంతం కావడంతో అక్కడి భారత రాయబారి కార్యాలయం అధికారులు పూర్తి సమాచారం కోసం ఆరా తీస్తున్నారని తెలిసింది.
-
సమ్మర్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే రావాలనిపించదు.. తక్కవ బడ్జెట్ లో ఇలా చుట్టేయండి.. -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications