గుడికి తాళం వేపించిన సీఎం, ఎంత చెప్పినా మాట వినలేదని, ఏంజరిగిందంటే ?
చెన్నై/విల్లుపురం: ఓ గ్రామంలోని ఓ ఆలయానికి తమిళనాడు ప్రభుత్వం బుధవారం తాళం వేసింది. దళితులు ఈ ఆలయంలోకి ప్రవేశించకూడదని ఆధిపత్య కులాలు ఆదేశించాయి. దీనిపై జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు శాంతి చర్చలు జరిగాయి. అయితే దళితులకు మాత్రం గుడిలోకి ప్రవేశం ఇవ్వడానికి నిరాకరించారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆలయానికి సీల్ వేసిందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ హెరాల్డ్ తెలిపింది.
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మేలపాటి గ్రామంలో శ్రీ ధర్మరాజ ద్రౌపది అమ్మన్ ఆలయంలోకి గ్రామంలో మెజారిటీగా ఉన్న వన్నియార్లు మమ్మల్ని గుడిలోకి వెళ్లడానికి అనుమతించడం లేదని ఎస్సీ వర్గీయులు ఆరోపించడంతో వివాదం చెలరేగింది. దళితులు ఆలయంలోకి ప్రవేశించేలా శాంతిని నెలకొల్పేందుకు జిల్లా యంత్రాంగం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే అధికారులు చేసిన అన్ని ప్రయత్నాలు వ్యర్థం అయ్యింది.

ఈ ఆలయాన్ని హిందూ, దేవాదాయ శాఖ నిర్వహిస్తోంది. గ్రామంలోని వన్నియార్లు ఆలయ రోజువారీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. దళితులు గుడి బయటి నుంచి దేవుడిని పూజించవచ్చు. కానీ ఎస్సీలు ఆలయంలోకి ప్రవేశించకూడదనే తమ వైఖరిలో ఎలాంటి మార్పులు ఉండవని విన్నియార్లు పట్టుపట్టడంతో శాంతి చర్చలు విఫలం అయ్యాయి.
మే నెలలో చివరి దఫా చర్చలు జరిగినా అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో బుధవారం విల్లుపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్.రవిచంద్రన్ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులతో కలిసి గ్రామానికి వెళ్లి ఆలయానికి సీల్ వేశారు. శాంతిభద్రతలు క్షీణించకుండా ఆలయాన్ని మూసివేశారు. గుడి ముందు పోలీసులకు కాపలాపెట్టారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్ పీసీ) సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకున్నట్లు డెక్కన్ హెరాల్డ్‌కు సీనియర్ అధికారి తెలిపారు.

శాంతిభద్రతలకు విఘాతం కలగడం వంటి పనులు గుర్తిస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పూర్తి అధికారాన్ని అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్‌లో, వార్షిక పండుగ సందర్భంగా ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన దళితులపై వన్నియార్లు దాడి చేశారు, ఇది రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. అప్పటి నుంచి వివాదం ఎక్కువ అయ్యిందని రెవెన్యూ. పోలీసు అధికారులు అంటున్నారు.
విల్లుపురం ఎంపీ డి.రవికుమార్ డెక్కన్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ ప్రతి వర్గానికి చెందిన వాళ్లు గుడికి వెళ్లి పూజించే హక్కు ఉందని, అందరిని తమిళనాడు ప్రభుత్వం గౌరవించి అమలు చేసేలా చూడాలన్నారు. ఆలయానికి ధర్మకర్తలను నియమించి రోజువారీ వ్యవహారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేసేందుకు వీలు కల్పించాలని దళితులు పోలీసులను ఆశ్రయించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications