సినీ ఫక్కీలో: రైలు పైకప్పుకు రంధ్రం చేసి రూ.5 కోట్లు చోరీ
చెన్నై: సినిమాల్లో మాదిరి పకడ్బందీగా భద్రతా సిబ్బంది మధ్య డబ్బును రైలులో తరలించినప్పటికీ రైలు పైకప్పుకు రంధ్రం చేసి అందులో ఉన్న రూ. ఐదు కోట్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. రైలులో భారీ దోపిడి జరిగిన ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది.
తమిళనాడులో సేలం ఎక్స్‌ప్రెస్ రైలులో తరలిస్తున్న రూ.342 కోట్లలో రూ. ఐదు కోట్లు మాయమయ్యవడంతో అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే... సోమవారం రాత్రి సేలం నుంచి సేలం ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి చెందిన పాత నోట్లు రూ. 342 కోట్లతో రైలు బయల్దేరింది.
సేలం నుంచి చెన్నై సిటీల మధ్య దూరం 350 కిలోమీటర్లు. ఈ దూరాన్ని చేరుకునే క్రమంలో రైలులో ఉన్న రూ. 342 కోట్ల డబ్బులో రూ. ఐదు కోట్లు కనిపించకుండా పోయాయి. రైలులో మొత్తం 226 పెట్టెల్లో డబ్బును తరలిస్తుండగా అందులో రెండు బాక్స్‌లు పగిలిపోయి ఉన్నట్లు మంగళవారం ఉదయం 3.55 గంటల ప్రాంతంలో అధికారులు గుర్తించారు.
రైల్లో దొంగలు దొంగిలించిన మొత్తాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఈ మొత్తం డబ్బులో రూ. ఐదు కోట్లు పోయాయని ఆర్‌బీఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైలు పెట్టే పైభాగంలో రంధ్రం చేసి లోపలకి దిగి డబ్బును దోచుకెళ్లిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు.
పెట్టెల్లో ఉన్న డబ్బుని బయటకు లాగిన ఆనవాళ్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సేలం నుంచి చెన్నైకి వచ్చే మార్గంలో రైలు పెట్టే పైభాగానికి రంధ్రం చేసి ఎవరో ఈ డబ్బు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నగదు మొత్తం చెన్నైలోని ప్రభుత్వ బ్యాంకులకు ఆర్‌బీఐ అప్పగించాల్సి ఉంది.
ఏసీపీ స్థాయి అధికారి భద్రతతో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ రైలు చెన్నైలోని ఎగ్మోర్ స్టేడియంలో ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చెన్నైలో రైలు పైకప్పుకు రంధ్రం చేసి రూ. 342 కోట్ల చోరీ
సినిమాల్లో మాదిరి పకడ్బందీగా భద్రతా సిబ్బంది మధ్య డబ్బును రైలులో తరలించినప్పటికీ రైలు పైకప్పుకు రంధ్రం చేసి అందులో ఉన్న రూ. 342 కోట్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది.

చెన్నైలో రైలు పైకప్పుకు రంధ్రం చేసి రూ. 342 కోట్ల చోరీ
తమిళనాడులో సేలం ఎక్స్‌ప్రెస్ రైలులో తరలిస్తున్న రూ.342 కోట్లు మాయమయ్యవడంతో అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే... సోమవారం రాత్రి సేలం నుంచి సేలం ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి చెందిన పాత నోట్లు రూ. 342 కోట్లతో రైలు బయల్దేరింది.

చెన్నైలో రైలు పైకప్పుకు రంధ్రం చేసి రూ. 342 కోట్ల చోరీ
సేలం నుంచి చెన్నై సిటీల మధ్య దూరం 350 కిలోమీటర్లు. ఈ దూరాన్ని చేరుకునే క్రమంలో రైలులో ఉన్న రూ. 342 కోట్ల డబ్బు కనిపించకుండా పోయింది. రైలులో మొత్తం 226 పెట్టెల్లో డబ్బును తరలిస్తుండగా అందులో రెండు బాక్స్‌లు పగిలిపోయి ఉన్నట్లు మంగళవారం ఉదయం 3.55 గంటల ప్రాంతంలో అధికారులు గుర్తించారు.

చెన్నైలో రైలు పైకప్పుకు రంధ్రం చేసి రూ. 342 కోట్ల చోరీ
పెట్టెల్లో ఉన్న డబ్బుని బయటకు లాగిన ఆనవాళ్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సేలం నుంచి చెన్నైకి వచ్చే మార్గంలో రైలు పెట్టే పైభాగానికి రంధ్రం చేసి ఎవరో ఈ డబ్బు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నగదు మొత్తం చెన్నైలోని ప్రభుత్వ బ్యాంకులకు ఆర్‌బీఐ అప్పగించాల్సి ఉంది.

చెన్నైలో రైలు పైకప్పుకు రంధ్రం చేసి రూ. 342 కోట్ల చోరీ
ఏసీపీ స్థాయి అధికారి భద్రతతో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ రైలు చెన్నైలోని ఎగ్మోర్ స్టేడియంలో ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Click it and Unblock the Notifications