భారీ ఎన్‌కౌంటర్: ముగ్గురు జవాన్లు మృతి, 14 మందికి గాయాలు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో మరోసారి మావోయిస్టులు దాడులతో రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోని టేకులగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సీఆర్పీఎఫ్ కోబ్రా దళం, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, జిల్లా రిజర్వ్ బృందాలు కలిసి స్థానికంగా ఏర్పాటు చేసిన క్యాంపు పరిసరాల్లో మంగళవారం గాలింపు చర్యలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కమాండోలు దాడిని తిప్పికొట్టినట్లు వెల్లడించాయి. క్షతగాత్రులను రాయ్‌పూర్‌కు హెలికాప్టర్‌లో తరలిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

 Chhattisgarh: 3 CRPF Jawans Martyred, 14 Injured In Fierce Gunbattle With Maoists

ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ సైనికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతమని చెప్పారు. టేకులగూడ క్యాంపు నుంచి భద్రతా దళాలు ఎప్పటిలాగే మంగళవారం కూడా కూంబింగ్​‌కు వెళ్లాయని తెలిపారు. టేకులగూడలో నక్సలైట్లను ఏరిపారేసేందుకు సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేశాయి భద్రతా బలగాలు. సైనికుల శిబిరం అక్కడ ఉన్నప్పటి నుంచి నక్సల్స్ దాడులు కొంతమేర తగ్గాయి.

కాగా, 2021 ఏప్రిల్‌లో టేకులగూడలో నక్సలైట్లు, భద్రతా బలగాల మధ్య భారీ ఎన్‌​కౌంటర్​ జరిగింది. నక్సల్స్ జరిపిన కాల్పుల్లో 23 మంది సైనికులు వీరమరణం పొందారు. అలాగే సైనికుల వద్ద ఉన్న ఆయుధాలను సైతం మావోయిస్టులు దోచుకున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+