వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్తర్‌లో అనూహ్య ఎన్‌కౌంటర్‌-పోలీస్ క్యాంపుపై మావోయిస్టుల దాడి-కాల్పుల్లో గ్రామస్తులు మృతి,ఏమైందంటే..

|
Google Oneindia TeluguNews

మధ్యభారతంలోని బస్తర్ అటవీ ప్రాంతంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయానికితోడు పోలీసులు-నక్సలైట్ల మధ్య ఆధిపత్యపోరు సామాన్య జనం ప్రాణాలను బలితీసుకుంటున్నది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అనూహ్య ఎన్ కౌంటర్ లో ఆదివాసీ గిరిజనులు బలైపోయారు. గత నెలలో మావోయిస్టులు భీకర దాడికి పాల్పడిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే తాజా సంఘటన జరిగింది. ఎన్‌కౌంటర్ వార్తలను బస్తర్ ఐజీ సౌందరరాజన్ సైతం నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే..

 బట్టలు చించుకున్న రఘురామ -సుప్రీం షాక్ -సాయిరెడ్డి జారుడు బండ ఫిలాసఫీ -జగన్‌కు చంద్రబాబు సిఫార్సా? బట్టలు చించుకున్న రఘురామ -సుప్రీం షాక్ -సాయిరెడ్డి జారుడు బండ ఫిలాసఫీ -జగన్‌కు చంద్రబాబు సిఫార్సా?

పోలీస్ క్యాంపుపై నక్సల్స్ దాడి

పోలీస్ క్యాంపుపై నక్సల్స్ దాడి

అడవంతా పలుచగా కనిపించే వేసవి కాలంలో సాధారణంగానే నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లు జోరుగా సాగుతుంటాయి. మన దేశంలో వామపక్ష తీవ్రవాదానికి నెలవైన బస్తర్ అటవీ ప్రాంతంలోనూ కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు తలపెట్టాయి. అయితే, గత నెలలో ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత మరింత అప్రమత్తమైన బలగాలు వ్యూహాత్మక ప్రాంతాల్లో కొత్తగా క్యాంపులు ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీకి చెందిన జవాన్లు ఉమ్మడిగా సెర్చ్ ఆపరేషన్లు సాగిస్తున్నారు. అలా కొత్తగా ఏర్పాటైన ఓ క్యాంపుపై సోమవారం మధ్యాహ్నం మావోయస్టులు దాడి చేశారు. ఈ క్రమంలో అనూహ్య ఘటనలు జరిగాయి..

ఒక్క దెబ్బకు సెట్‌రైట్:స్టాలిన్ చెంతకు రజనీకాంత్ -సీఎం కరోనా నిధికి భారీ విరాళం, చియాన్ విక్రమ్ కూడా..ఒక్క దెబ్బకు సెట్‌రైట్:స్టాలిన్ చెంతకు రజనీకాంత్ -సీఎం కరోనా నిధికి భారీ విరాళం, చియాన్ విక్రమ్ కూడా..

ఎదురుకాల్పుల్లో గ్రామస్తులు మృతి

ఎదురుకాల్పుల్లో గ్రామస్తులు మృతి


బస్తర్ రీజియన్ లోని బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో గల సిల్గర్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఇటీవలే కొత్త క్యాంపును ఏర్పాటు చేశాయి. ఏప్రిల్ 3నాటి భారీ ఎన్ కౌంటర్ తర్వాత సిల్గర్ ప్రాంతంలోని క్యాంపును మరింత యాక్టివ్ గా వాడుకుంటూ బలగాలు ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. కాగా, చాలా కాలంగా ఇటు పోలీసులు, అటు నక్సలైట్ల మధ్య నలిగిపోతున్న స్థానిక ప్రజలు.. క్యాంపును అక్కడి నుంచి ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని 15 గ్రామాలకు చెందిన ప్రజలు సిల్గర్ పోలీస్ క్యాంప్ ఎదురుగా ఈనెల 14 నుంచి నిరసనలో కూర్చున్నారు. అయితే, ఇవాళ నిరసనకారుల ముసుగులో ప్రవేశించిన మావోయిస్టులు.. పోలీస్ క్యాంపుపై దాడి చేయగా, ఎదురుకాల్పుల్లో గ్రామస్తులు మరణించారు..

మూడు వైపులా మరణాలు?

మూడు వైపులా మరణాలు?


సిల్గర్ ప్రాంతంలో పోలీస్ క్యాంపునకు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన చేస్తుండగానే నక్సల్స్, పోలీసుల మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ముగ్గురు స్థానిక గ్రామస్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎన్ కౌంటర్ వార్తలను నిర్ధారించిన బస్తర్ ఐజీ సౌందరరాజన్.. కాల్పుల్లో కొందరు మావోయిస్టులు కూడా చనియి ఉంటారని తెలిపారు. బస్తర్ ప్రాంతంలోని స్థానిక చానెళ్లు మాత్రం సీఆర్పీఎఫ్ జవాన్లు కూడ మృతి చెంది ఉండొచ్చని తెలిపాయి. ఎన్ కౌంటర్ సమాచారం అందిన వెంటనే అదనపు పోలీసు బలగాలు తరలివెళ్లాయి. తాజా ఘటన జరిగిన ప్రాంతం.. ఏప్రిల్ 4నాటి ఎన్ కౌంటర్ ప్రదేశానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తాజా ఆపరేషన్ కు కూడా నక్సల్ నేత హిడ్మానే నేతృత్వం వహించి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
In Chhattisgarh, Naxalites attacked the security force's joint camp at on Monday. incident happened at Bijapur and Sukma border. when maoists opened fire on the camp, soldiers have also retaliate. Three villages were killed in the grip of this firing. These villagers were protesting against the camp for the last three days. The encounter has been confirmed by Bastar IG Sundarraj P. He said that some Naxalites have also been killed in the firing. Meanwhile, some jawans are also expected to be injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X