సెక్స్ సీడీ వ్యవహారం.. ఎఫ్‌ఐఆర్‌లో కాంగ్రెస్ చీఫ్ పేరు, మంత్రి ఒత్తిడిమేరకేనా?
ఛత్తీస్‌గఢ్ మంత్రి రాజేష్ మునత్ సెక్స్ సీడీ ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కాంగ్రెస్ చీఫ్ భూపేష్ బాఘెల్ పేరును కూడా రాయ్‌పూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ లో చేర్చారు.
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ మంత్రి రాజేష్ మునత్ సెక్స్ సీడీ ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కాంగ్రెస్ చీఫ్ భూపేష్ బాఘెల్ పేరును కూడా రాయ్‌పూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ లో చేర్చారు.
మంత్రి రాజేష్ మునత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన పేరును జత చేర్చినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న పాత్రికేయుడు వినోద్ వర్మను శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అరెస్ట్ సమయంలో తన దగ్గరుంది మంత్రి రాజేష్ మునత్ వ్యక్తిగత వీడియో అని వినోద్ మీడియాకు వెల్లడించాడు. అది నచ్చకే ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్య చేపట్టిందని కూడా పేర్కొన్నాడు.
అయితే మంత్రి రాజేష్ మునత్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. సీడీ వ్యవహారం ఫేక్ అని.. కావాలంటే విచారణ జరిపించాలని... ప్రకటించారు. మరోవైపు మీడియా హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని.. మంత్రిని రక్షించేందుకు యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించగా.. బీజేపీ మాత్రం వాటిని ఖండించింది.
పాత్రికేయుడు వినోద్ వర్మ అరెస్ట్ తర్వాత ఆయన ఇంట్లోంచి సుమారు 500 సీడీలను, పెన్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అందులో ఏముందన్న విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించటం లేదు.












Click it and Unblock the Notifications