బడి పిల్లలకు చికెన్ బిర్యానీ, సీఎం విజయ్ మార్క్ సంచలన నిర్ణయం!

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సర్కార్ అద్భుతమైన తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. బడి పిల్లలకు పౌష్టికాహారంతో పాటు రుచికరమైన భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకంలో 'చికెన్ బిర్యానీ'ని చేర్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇది నేరుగా సీఎం విజయ్ ఆకాంక్ష అని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తమిళనాడు విద్యా రష్యాలో మరో మైలురాయిగా నిలవబోతోంది.

ఖైదీలకే ఉన్నప్పుడు.. మన పిల్లలకెందుకు ఉండకూడదు?

ప్రభుత్వ బడుల్లో చికెన్ బిర్యానీ వడ్డించడంపై మంత్రి రాజ్ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పుళల్ జైలులోని ఖైదీలకు కూడా చికెన్ బిర్యానీ అందిస్తున్నప్పుడు, దేశ భవిష్యత్తు అయిన మన పాఠశాల విద్యార్థులకు ఎందుకు అందించకూడదు?" అని ఆయన ప్రశ్నించారు. పెరిగే వయసులో పిల్లలకు అవసరమైన ప్రొటీన్లు అందించడం ఎంతో ముఖ్యమని, ఈ నిర్ణయాన్ని ఎవరూ రాజకీయ కోణంలో చూడకూడదని కోరారు. ఆహార ఎంపికలో విద్యార్థుల అభిరుచులను గౌరవిస్తూ.. శాకాహారం తినే పిల్లలకు పాత పద్ధతిలోనే నాణ్యమైన వెజ్ భోజనాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Chicken Biryani In Mid-Day Meals Tamil Nadu CM Vijay Government Prepares Big Treat For School Children
ఉప ఎన్నికలకు ముందు విజయ్ సర్కార్ గోల్డ్ స్కీమ్.. అసలు కథ ఇదే!
ఉప ఎన్నికలకు ముందు విజయ్ సర్కార్ గోల్డ్ స్కీమ్.. అసలు కథ ఇదే!

పైలట్ ప్రాజెక్ట్‌తో నాణ్యత పరిశీలన

ఈ భారీ పథకాన్ని అంతటా ఒకేసారి కాకుండా దశలవారీగా అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. వంట తయారీలో పరిశుభ్రత, ఆహార భద్రత అత్యంత కీలకమైన అంశాలు కాబట్టి, ముందుగా కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో 'పైలట్ ప్రాజెక్ట్' నిర్వహించనున్నారు. అక్కడ ఆహార సరఫరా, క్వాలిటీ, లాజిస్టిక్స్ ప్రక్రియలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించనున్నారు. ప్రతి విద్యార్థికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందేలా పక్కా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

విజయ్ వన్ మ్యాన్ షో- పాలనను మించి కల్ట్ పాలిటిక్స్- 4 నెలల్లో జరిగిందేంటి ?
విజయ్ వన్ మ్యాన్ షో- పాలనను మించి కల్ట్ పాలిటిక్స్- 4 నెలల్లో జరిగిందేంటి ?

విద్యా విప్లవంతో పాటు పౌష్టికాహార విప్లవం!

తమిళనాడులో విద్యారంగ అభివృద్ధి ఎప్పుడూ పౌష్టికాహార విప్లవంతో ముడిపడి ఉందనేది చారిత్రక సత్యం. గతంలో ప్రవేశపెట్టిన ఉచిత భోజన పథకాల నుంచి నేటి ఉదయం టిఫిన్ ప్రోగ్రామ్ వరకు తమిళనాడు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు పాఠశాలలకు విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా సీఎం విజయ్ సర్కార్ ఈ సరికొత్త మెనూ మార్పులకు శ్రీకారం చుట్టింది. రాబోయే రోజుల్లో బడి పిల్లలకి చికెన్ బిర్యానీ అందించేందుకు యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+