మ్యాథ్స్ ఆన్సర్ షీట్లో 'చికెన్ సాంబార్' రాసిన విద్యార్థి, ఐదింటికే లేస్తా కానీ
బెంగళూరు: కర్నాటకలో ఎస్ఎస్ఎల్సీ పరీక్షల్లో విద్యార్థులు గణిత పరీక్ష జవాబు పత్రాల్లో చికెన్ సాంబార్ గురించి ఒకరు, తనకు పాస్ మార్కులు వేయాలని ఇంకొకరు రాశారు. ఆన్సర్ షీట్లలో పై సమాధానాలు రాయడంతో అవి ఇప్పుడు వాట్సప్, ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
మేథమేటిక్స్ పరీక్ష సమయంలో జవాబు పత్రాల్లో.. ఓ విద్యార్థి, పరీక్షకు వారం రోజుల క్రితం తాను తిన్న చికెన్ సాంబార్ గురించి రాశాడు. అతను ప్రశ్నాపత్రంలోని 27వ ప్రశ్నకు చికెన్ సాంబార్ గురించి రాశాడు. మరో విద్యార్థి, తనకు కనసం 60 మార్కులు వేయాలని కోరాడు.
తనకు గణితం ఏం అర్థం కావడం లేదని, తాను మాత్రం తన ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు. తాను ఉదయం ఐదున్నరకే లేస్తున్నానని, గణితంతో కుస్తీ పడుతున్నానని, కానీ ఒక్కటి కూడా తనకు అర్థం కావడం లేదని రాశాడు. ఈ గణిత సమస్యలు అవసరమైనవి కావని కూడా అందులో రాశాడు. తనకు మంచి మార్కులు వేస్తే, తన పేపర్ దిద్దిన వారికి దేవుడి ఆశీస్సులు ఉంటాయని కూడా రాశాడు.

మరో వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసే కోణంలో రాశాడు. అతను పంతొమ్మిదవ ప్రశ్నకు సమాధానం రాసాడు. చేతబడి కోణంలోనూ రాశాడు. తాను అన్ని విషయాలలోను (సబ్జెక్ట్) బాగానే ఉన్నానని, గణితంలో మాత్రం ఏమీ అర్థం కావడం లేదని రాశాడు.
దీనిపై కర్నాటక స్టేట్ హై స్కూల్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఇలాంటివి మామూలేనని, కానీ ఇవి బయటకు ఎలా వచ్చాయో తెలియడం లేదన్నారు. పత్రాలు దిద్దే కేంద్రాల్లోకి సెల్ ఫోన్‌లను తీసుకు వెళ్లనీయలేదని, ఇలాంటప్పుడు అవి వాట్సప్, ఇతర సామాజిక అనుసంధాన వేదికల్లోకి ఎలా వచ్చాయో తెలియదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications