కేజ్రీవాల్ సర్కార్‌పై చిదంబరం గుస్సా: కన్హయ్య కుమార్‌పై దేశద్రోహ కేసు విచారణపై మండిపాటు..
జేఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై ఇదివరకు నమోదైన దేశద్రోహం కేసును అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విచారించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తప్పుపట్టారు. 2016లో కన్హయ్యతోపాటు మరో తొమ్మిది మందిపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటి కేసును ఇప్పుడు పున: ప్రారంభించడంపై పీ చిదంబరం పెదవి విరిచారు. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్య సరికాదని విమర్శించారు.
దేశద్రోహ చట్టాన్ని అర్థం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కన్నా ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని చిదంబరం ఆరోపించారు. 120బీ, 124ఏ సెక్షన్ల కింద నమోదైన కేసుకు సంబంధించి దేశ ద్రోహం విచారణ జరిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని స్పష్టంచేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు విచారించాలని స్టాండింగ్ న్యాయవాది సలహా ఇచ్చిన ఏడునెలల తర్వాత విచారణ జరపడాన్ని తప్పుపట్టారు.

పార్లమెంట‌్‌పై దాడి చేసిన దోషి అప్జల్ గురును ఉరితీయడంపై వ్యతిరేకంగా ఫిబ్రవరి 9.. 2016లో జేఎన్‌యూలో నినాదాలు చేశారని చార్జీషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. పార్లమెంట్‌పై దాడిచేసిన ఉగ్రవాదిని ఉరితీస్తే వ్యతిరేకిస్తూ... దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంగతి తెలిసిందే.
దేశ ద్రోహ కేసు విచారణపై కన్హయ్య కుమార్ స్పందించారు. కేసు విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో విచారణ వేగంగా పూర్తవుతోందని ఆయన ఆకాంక్షించారు. అయితే దేశద్రోహ కేసులు, ఇతర కేసులు రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయని, దీంతో తప్పుచేయని వారికి కూడా శిక్ష పడుతోందని కన్హయ్య కుమార్ ట్వీట్ చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications