ఆయా రంగాల వృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలేవీ..!! 7 శాతం జీడీపీ ఎలా సాధ్యమని చిదంబరం ప్రశ్న
న్యూఢిల్లీ : ఆర్థిక సర్వేపై విపక్ష కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఆయా రంగాలవారీగా వృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించలేదని మండిపడింది. ఆర్థిక వృద్ధి కూడా ఆశించిన స్థాయిలో లేదని .. రెవెన్యూ రాబడి పడిపోయిందని ఆరోపించింది. ఆర్థిక వనరులు ఎలా సమకూరుస్తారో తెలుపకుండా కేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నించింది.
ఉద్యోగాలేవీ ?
ఆర్థిక సర్వేలో సానుకూల అంశాలేమీ లేవన్నారు మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం. యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు, వృద్ధి కోసం బీజేపీ సర్కార్ అనుసరించిన విధానాలు ఏంటని ప్రశ్నించారు. చిన్న పరిశ్రమల్లో ఉపాధి కల్పన కోసం తీసుకున్న చర్యలపై క్లారిటీ లేదని విమర్శించారు. అలాగే కొత్త ఉద్యోగాల సృష్టించేందుకు అనుసరించే విధానాలను తెలుపలేదని మండిపడ్డారు. దీనికి నిరుద్యోగితి పెరగడం సజీవ సాక్ష్యమని వివరించారు. గత 45 ఏళ్లలో 6.1 శాతానికి నిరుద్యోగిత చేరిందని గుర్తుచేశారు.

వాస్తవానికి నేషనల్ శాంపిల్ సర్వే ఎన్నికలకు ముందే ఈ వివరాలను సేకరించినా .. ప్రభుత్వం నిలిపివేయాలని సూచించడంతో ఆపేశారని తెలిపారు. మోడీ ప్రభుత్వం మరోసారి కొలువుదీరాక పాత చింతకాయ పచ్చడిలా నిరుద్యోగితను అధికారికంగా ప్రకటించారని పేర్కొన్నారు. 2019 జూన్ 25నాటికి నిరుద్యోగితి 8.1 శాతానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలుపడం ఆందోళన కలిగిస్తోందన్నారు చిదంబరం.మోడీ ప్రభుత్వ విధానాలతో ఉపాధి కరవవుతోందని గుర్తుచేశారు. దేశంలో 3.7 కోట్ల మంది తమ ఉపాధిని కోల్పోతున్నారనే కఠోర సత్యాన్ని తెలిపారు. ఇందులో 3 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉండటం ఆందోళన కలిగిస్తుందని గుర్తుచేశారు.
కనిష్టానికి చేరిన అభివృద్ధి ..
జీడీపీ 7 శాతం ఉంటుందని ఆర్థికసర్వేలో అంచనా వేశారు. ఏ ప్రతిపాదికన కింద చేశారో వివరించలేదని మండిపడ్డారు. అంతేకాదు గత ఐదేళ్లలో ఆర్థికవృద్ధి కనిష్టానికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. 8.0, 7.0, 6.6, 5.8గా వృద్ధి రేటు ఉందని తెలిపారు. 10 నెలలుగా ఆటోమొబైల్ రంగం క్షీణిస్తుందని .. అయినా మోడీ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని వివరించారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications