ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసు: చిదంబరంను ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం బుధవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ప్రశ్నించేందుకు సీబీఐ ఆయనను విచారణకు పిలిచింది. విచారణ కోసం చిదంబరం బుధవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధానకార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించి పలు అంశాలపై సీబీఐ చిదంబరంను ప్రశ్నించింది.
చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ఇచ్చిన అనుమతులలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కేసులో చిదంరం కుమారుడు కార్తి చిదంబరం, ఐఎన్‌ఎక్స్ మీడియా మాజీ అధినేతలు పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియా కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.

ఎన్‌ఎక్స్ మీడియాకు సంబంధించిన విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్‌ఐపీబీ)కి అనుమతి ఇవ్వడంలో చిదంబరం పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గత ఏడాది మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ కార్తి చిదంబరంను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి చిదంబరాన్ని జులై 3 వరకు అరెస్ట్ చేయొద్దని దిల్లీ హైకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులోనూ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కూడా ఆయనను జులై 10 వరకు అరెస్ట్ చేయొద్దని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications